పవన్ కళ్యాణ్ మరదలుగా వంద మార్కులు కొట్టుకున్న సమంత టాలీవుడ్ లోని తన తోటి హీరోయిన్ల రికార్డులు కూడా బద్దలు చేసిందంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాతో సమంత నెంబర్ వన్ స్థానం దక్కించుకుందట. ఈ స్థానం అత్యదిక సినిమాలు చేతిలో ఉంచుకున్న హీరోయిన్ గానే కాకుండా అత్యదిక కలెక్షన్లు సాదించిన సినిమా హీరోయిన్ గా కూడా రికార్డు కొట్టేసినట్టే అంటున్నారు.

 ఈ రికార్డు ఇప్పటి వరకు కాజల్ ఖాతాలో ఉంది. టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్ తో రికార్డు సొంత చేసుకున్న మగధీర తో కాజల్ ఈ రికార్డు తన వద్ద ఉంచుకుంది. ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్లలో మగధీర ను దాటేసినట్టే. అందుకే ఈ రికార్డును సమంత బ్రేక్ చేసిందంటున్నారు.

అంతే కాదు అత్తారింటికి దారేది హిట్టుతో సమంత ఇమేజి కూడా పర్వతం అంత ఎత్తుకు ఎదిగిదంటున్నారు. ఈ సినిమా లో తన నటనా ప్రతిభతో టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా సమంత నిలిచింది అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ దెబ్బతో సమంతకు ఆఫర్లు అంతా ఇంతా కాదట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: