బాలక్రిష్ణ మౌనంగా ఉన్నాడు, కనిపించడం లేదు అనుకుంటున్నారు కదూ... ఇదంతా నందమూరి అభిమానులకు కళ్లు చెదిరే షాకివ్వడానికేనట. రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమా షూటింగ్ పైనే బాలయ్య ప్రధాన దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. తను కొత్తగా తీస్తున్న ‘లెజండ్’ సినిమా ద్వారా బాలయ్య బాక్స్ బద్దలయ్యే విదంగా కనిపించనున్నాడట.

ఇక ఆయన సాటి హీరోలయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో పోలిస్తే కాస్తా మాస్ ను అదరగొట్టడంలో అప్పట్లో బాలయ్యదే హైలెట్. ఇప్పుడు దాంతో పాటు లేటు వయసులోను ఘాటు స్టైలు ను చూపించబోతున్నాడంటున్నారు. దీనికోసం ఏకంగా బాలక్రిష్ణ 8 కిలోల బరువు తగ్గాడంటున్నారు. అంతే కాదు స్పెషల్ డ్యాన్స్ కోసం స్టెప్పులు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడంటున్నారు.

అంతే కాదు లెజండ్ సినిమాలో రెండు అవతారాల్లో కనిపించి కంగు తినిపించనున్నాడంటున్నారు. ఒకటి లేటెస్ట్ పట్నం కుర్రాడి స్టయిల్లో అదరగొడుతున్నాడు. మరో రోల్ లో పవర్ ఫుల్ మాస్ పవర్ తో కనిపించనున్నాడు బాలక్రిష్ణ. అందుకే నందమూరి అభిమానులు బాలయ్య కొత్త సినిమా కోసం వేయి కళ్లతో ఎదిరి చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: