భాయ్ కథ బయట పడింది అంటున్నారు. భాయ్ తో నాగార్జున భవిష్యత్తు కూడా ముడిపడి ఉంటుందంటున్నారు. కారణం ఆయన సమకాలీనులైన హీరోలు నలుగురయితే ఇద్దరు సినిమాల నుంచి హీరోలుగా రిటైరయినట్టే. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి దూరం కాగా, వెంకటేష్ సింగిల్ గా కాకుండా మల్టీ స్టారర్ సినిమాలకు పరిమితమయ్యాడు.

ఇక బాలక్రిష్ణ ఓ పవర్ ఫుల్ సినిమా ‘లెజండ్’ తో తన ఆఖరి రీల్ పరీక్షించుకోబోతున్నాడు. నాగార్జునది అదే పరిస్థితి అక్టోబరు 25 న రిలీజ్ కానున్న ‘భాయ్’ తో అదే పరీక్షకు సిద్దమయ్యాడు అంటున్నారు. కారణం ఆయన లేటెస్ట్ సినిమాలు డమరుకం, గ్రీకువీరుడు తుస్సుమన్నాయి.

అయితే ‘భాయ్’ సినిమా పై మంచి టాక్ వస్తోంది. సినిమా ఎంటర్ టైన్ మెంట్, మాస్ గా ఉందట. మొదటి హాఫ్ బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్ స్లో గా ఉందట. పంచ్ డైలాగులు కూడా బాగానే అదరగొడుతాయంటున్నారు. అయితే హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ అంతగా సూట్ కాలేదంటున్నారు. రిలీజ్ అయితే కాని నాగార్జున సినిమా ప్రస్థానం ఏంటన్నది అర్థం కాదంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: