పూరి జగన్నాద్, మహేష్ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు టాలీవుడ్ లో క్రియేట్ చేసిందో అందరికి తెలిసిన విషయమే వీరిద్దరి కలయిక లో సినిమా వస్తోంది అంటే మహేష్ అభిమానులకు పండుగే. అయితే అటువంటి వీరిద్దరి సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల కాబోతున్నాయి అనే వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘1’ నేనొక్కడినే జనవరి 10 న రిలీజ్ అవుతుందని ప్రకటించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేస్తున్నారు.

మహేష్ సినిమాతో బన్నీ ‘రేసుగుర్రం’ పోటీగా వస్తుందని ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. అయితే అనుకోకుండా ‘రేసుగుర్రo’ సంక్రాంతి రేసు నుండి తప్పుకుని ఆ స్థానంలో పూరి నితిన్ ల కాంబినేషన్ లో తయారవుతున్న ‘హార్ట్ ఎటాక్’ మహేష్ కు పోటీ గా నిలిచి మహేష్ అభిమానులకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది అనే వార్తలు ఫిలింనగర్ లో తెగ వినపడుతున్నాయి. ఈ వార్తలే నిజమైతే పూరి మహేష్ కు ఝలక్ ఇస్తాడు అనుకోవాలి. కానీ ఇంత సాహసం దర్శకుడు పూరి చేస్తాడా అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: