పవన్ కళ్యాణ్ ఎందరికో సహాయ సహకారాలు అందించాడు అని ఆయనను వ్యక్తీ గతంగా తెలిసిన చాలా మంది చెపుతూ ఉంటారు. అందుకే ఆయనను నిజజీవితంలో కూడా హీరో గా ఆరాధిస్తారు. పవన్ ఎవరి కైనా సాయం చేయడమే కాని ఇంకొకరిని సాయం అడగని వ్యక్తి. అటువంటి పవన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందికి అవకాశాలు ఇచ్చి టాప్ పోజిషన్‌లో ఉండేలా చేశాడు అని అంటారు. పవన్ ద్వారా మంచి టాప్ పోజిషన్‌లో ఉండేవారిలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒకరు. 'తొలిప్రేమ', 'బొమ్మరిల్లు', 'బృందావనం', 'బద్రినాథ్', 'సైనికుడు', 'ఖలేజా', 'శక్తి' మొదలైన ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ సాయి తన కెరీర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం పవన్ కళ్యానే కారణం అని చెబుతాడు.

ఇంతకి అసలు విషయం ఏమిటంటే సినిమాలలో రాక పూర్వమే ఆనంద్ సాయి పవన్ కు మంచి స్నేహితుడు అట. అయితే తోలి రోజులలో ఆనంద్ సాయికి ఆర్ట్ డైరక్షన్ అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదట. అయితే పవన్ ఆనంద్ సాయిని బలవంత పెట్టి ‘గోకులంలో సీత’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా పరిచయం చేసాడు. ఆతర్వాత సినిమా ఫీల్డ్ తనకు సెట్ కాదని చెన్నై వెళ్ళిపోయాడట ఆనంద్ సాయి. అయితే ఇది జరిగిన కొద్ది రోజులకు ఆనంద్ సాయి ని పవన్ తాను నటిస్తున్న తోలి ప్రేమ సినిమాకు తాజ్ మహల్ సెట్ వేయమన్నాడట.

ఈ కాన్సెప్ట్ ను ఆనంద్ సాయి పవన్ కు అప్పటికి ఐదు సంవత్సరాల క్రితమే చెప్పాడట. అయితే అప్పట్లో ‘తొలిప్రేమ’ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు ఈ సెట్ కు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే అ ఖర్చును తన పారితోషికం నుండి తగ్గించుకోమని పవన్ చెప్పి ఆనంద్ సాయికి ఈ అవకాసం ఇప్పించాడని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆనంద్ సాయి చెప్పాడు. ఇలా ఎందరికో సహాయం చేసిన వ్యక్తిత్వం కనుకే పవన్ అన్నా, పవనిజం అన్నా అభిమానులకు పిచ్చి ప్రేమ...

మరింత సమాచారం తెలుసుకోండి: