ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేను రాజ‌కీయాల్లోకి రాను బాబోయ్ అంటున్నా సోషియ‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ మాత్రం ప‌దే ప‌దే ఆ విష‌యాన్ని చెబుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వ‌స్తున్న ఆ వార్తలు, ప‌వ‌న్ ఇమేజ్‌ను పెంచుతాయి త‌ప్పితే ఎటువంటి డామేజ్ జ‌ర‌గ‌ద‌ని అంద‌రికి తెలుసు. ఈ మ‌ధ్యకాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగుదేశం పార్టిలో చేరుతున్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ విధంగానే వార్తలు కూడ వ‌స్తున్నాయి. 

అయితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ టి.డి.పిలో చేరితే ఎలా ఉంటుందో, దానికి సంబంధించిన ఒక ఫొటో నెట్‌లో తెగ ప‌బ్లిష్ అవుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టిడిపి కండువ‌ను క‌ప్పుకొని, అభిమానుల‌కు అభివాదం చేస్తున్నట్టుగా ఒక మార్ఫింగ్ ఫొటోను రెడీ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో పొలిటిక‌ల్‌లోనూ హాట్ టాపిక్ అవుతుంది. ప‌వ‌న్ నిజంగానే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాడా అనే డౌట్ కూడ చాలా మంది పొలిటికల్ లీడ‌ర్స్‌లో ఆస‌క్తి రేకిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: