కొద్ది రోజుల క్రితం వరకూ సమైఖ్య సెగతో రాష్ట్రం వేడెక్కిపోతే గత రెండు రోజులుగా మీడియాలో పవన్ రాజకీయ ప్రవేశం పై ప్రసారం చేస్తున్న కధనాలతో రాష్ట్ర రాజకీయాలు అయోమయంలో పడిపోతున్నాయి. పవన్ అభిమానులకు కూడా ఈ వార్తలు వేదేక్కిస్తున్నాయి. ఈ వార్తల నేపధ్యంలో పవన్ సన్నిహితుడు ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ విషయం పై ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించి ఈ అయోమయ పరిస్థితికి తెర దించడానికి తన ట్విటర్ ద్వారా స్పందించాడు. ‘పవన్ కళ్యాణ్ గురించి ప్రచారం జరుగుతున్న రూమర్లను నమ్మ వద్దని, అవన్నీ నిరాధారమైనవి, సెన్స్ లెస్' అంటూ ఆయన ట్వీట్ చేసారు.

కోన వెంకట్ ట్వీట్ పవన్ అభిమానులను కాస్త ఊరట పరిచినట్లయింది. ఈరోజు కూడా అనేక ఛానల్స్ లో వస్తున్న పవన్ పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు అడ్డు కట్ట పడాలి అంటే పవన్ కల్యాణ్‌ తన మౌనాన్ని వీడే వరకు ఇలా మీడియా కధనాలు వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. రాబోతున్న రోజులలో ఈ పొలిటికల్ వ్యవహారం ఇంకెన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: