అత్తారింటికిదారేది మూవీలో ఓ ప్యామిలీ పెద్దగా ఆ పాత్రకు జీవం పోసిన న‌టుడు బోమ‌న్ఇరాని. ప‌వ‌న్‌కు తాత‌గా న‌టించిన బోమ‌న్ ఇరాని మూవీకు జీవం పోశాడు. బోమ‌న్ ఇరాని గురించి ప‌వ‌న్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ పాత్రకు వందాశాతం న్యాయం చేశాడని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇంత‌టి మంచి న‌టుడ్ని కేవ‌లం ఒక్క మూవీతో ప‌వ‌న్ వదులుకోవాల‌ని చూడ‌టం లేదు. అందుకే ఈ హందీ న‌టుడ్ని మ‌రో రెండు మూవీల‌కు తీసుకోవాల‌ని చూస్తున్నాడు.

గ‌బ్బర్‌సింగ్ సీక్వెల్‌లోనూ పాత్రల ఎంపిక జ‌రిగిపోయిన‌ప్పటికీ, కొన్ని కీల‌క‌పాత్రల ఎంపిక‌లో మార్పులు జ‌రుగుతున్నాయిన టాలీవుడ్ టాక్‌. ఇందులో ఓ పాత్రకు బోమ‌న్ ఇరానిను తీసుకోవాల‌ని  డైరెక్టర్ సంప‌త్‌నందికు సూచించాడు. దీనికి సంబంధించిన మేట‌ర్‌ను మూవీ రిలీజ్ వ‌ర‌కూ కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉంచాల‌ని చిత్ర యూనిట్‌కి కూడ ప‌వ‌న్ ఆదేశించిన‌ట్టు తెలుస్తుంది. గ‌బ్బర్‌సింగ్2 క‌థ మొత్తం ఫైన‌ల్ అయిన‌ప్పటికి ఈ కథ‌పై మ‌రోసారి క్రాస్‌చెక్ జ‌రుగుతంది. అత్తారింటికిదారేది లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్టర్ మూవీ త‌రువాత వ‌స్తున్న మూవీ గ‌బ్బర్‌సింగ్‌2 కావ‌డంతో, ఈ మూవీను చాలా జాగ్రత్తగా తెర‌కెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: