నాక్ కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది. నా తిక్కేంటో చూపిస్తా..అందరి లెక్కలు తేలుస్తా అంటూ పవర్ స్టార్ పవర్  నేను ఆకాశంలాంటోన్ని ఉరుమొచ్చినా..మెరుపొచ్చినా ఎప్పడూ ఒకేలా ఉంటా ఫుల్ పంచ్ డైలాగ్ లు అందరికీ తెలుసు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో  గబ్బర్ సింగ్ 2 ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు.  దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.  అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం.

మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్ 2'. ఈ చిత్రం డిసెంబర్ 2 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని విశ్వసనీయ సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: