ఏంజ‌లీనా జోలి కోసం హీలీవుడ్ సెల‌బ్రిటీలు అంద‌రూ ఇప్పటీకీ క్యూలు క‌డుతున్నారంటే ఈ అమ్మడికి ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ఇట్టే అర్ధం అవుతుంది. ఒకప్పుడు ఏంజ‌లీనా ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఏజంలీనా మూవీ రిలీజ్ అవుతుందంటే హీలీవుడ్ బాక్సాపీస్ షేక్ కావాల్సిందే. బ‌డా మూవీలు సైతం ఎన్నో సార్లు ఈమె పోటీకు వెనుదిరిగాయి. త‌న గురించి ఒక ఆర్టిక‌ల్ వ‌చ్చిందంటే నిముషాల్లోనే ల‌క్షల్లో హిట్స్ వస్తాయి. ఇంత‌టి ఖ్యాతి గ‌డించిన ఏంజ‌లీనా, త‌న జీవిత క‌థ‌ను రాసుకోవాల‌ని నిర్ణయించుకుంది.

ఇప్పుడు సెల‌బ్రిటీలకు సంబంధించిన ప్రతిదీ బిజినెస్‌తోనే ముడిప‌డి ఉంటుంది. ఈ విధంగానే ఏంజ‌లీనా జోలి జీవిత‌క‌థ‌ను మేము ప‌బ్లిష్ చేస్తాము అంటూ ఓ ప‌బ్లికేష‌న్ ముందుకు వ‌చ్చింది. ఆమె జీవిత‌క‌థ‌ను పూర్తిగా రాసి,దానికి సంబంధించిన కాపీ రైట్స్‌ను ఆ ప‌బ్లికేష‌న్ కైవ‌సం చేసుకుంది. అందుకుగాను ఏజంలీనాజోలికి ముప్పై మిలియ‌న్ పౌండ్లను ఇస్తున్నారు. అంటే దాదాపు ముప్పై కోట్ల రూపాయ‌ల‌తో స‌మానం. ఏజంలీనా జోలి జీవిత‌క‌థ ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ కావ‌డంతో ఇది ఇంట‌ర్నేష‌న్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: