ప్రముఖ నిర్మాత, నటుడు మోహన్ బాబు ఏమి చేసినా, మాట్లాడిన సంచలనమే. లేటెస్ట్ గా మోహన్ బాబు మరో వింత బోర్డును ఆయన నిర్మిస్తున్న మంచువారి కుటుంబ సినిమా సెట్లో పెట్టి టాక్ ఆఫ్ దీ ఇండస్ట్రీగా మారారు. అంతేకాదు సెల్ ఫోన్ వాడితే నరుకుతానంటూ బోర్డు పెట్టించారు మోహన్ బాబు. మంచు ఫ్యామిలీ స్టార్స్ అయిన మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లతో రూపొందుతోన్న మల్టీ స్టారర్ సినిమా సెట్లో ఈ బోర్డు పెట్టించారని సమాచారం.

‘సెల్ ఫోన్ వాడిన వారిని నరక బడును గమనిక : ప్రొడ్యూసర్స్‌కు, మేనేజర్స్‌కి వర్తించదు' అని ప్రత్యేకంగా బోర్డు పెట్టించారట ఈ విలక్షణ నటుడు. సెట్లో సెల్ ఫోన్ల వల్ల సినిమాలోని సీన్లు, సినిమాకు సంబంధించిన సమాచారం బయటకు లీక్ అవుతుందనే భయంతో మోహన్ బాబు ఇలా ప్రవర్తించాడని అంటున్నారు. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దాసరి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం.

క్రమ శిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబుకు ఇలా ఒకేసారి సెల్ ఫోన్స్ పై కోపం రావడం ఆ కోపం సినిమా సెట్లో బోర్డుల రూపంలో కనిపించడం మరో సారి మోహన్ బాబు ఆవేశాన్ని తెలియచేస్తోంది అంటూ మోహన్ బాబు పై సెటైర్లు పడుతున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: