ఎన్నో ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తున్న వ‌న్ మూవీపై మ‌హేష్‌బాబు నిరాశ‌లో ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎంత‌కీ కొలిక్కిరావ‌డంలేదు. ఈ నెలాఖ‌రులోగా షూటింగ్‌ను పూర్తిచేయాల‌ని కొద్ది నెల‌ల క్రిత‌మే డైరెక్టర్ సుకుమార్‌కి మ‌హేష్ చెప్పాడు. అలాగే చిత్ర నిర్మాత‌లు కూడ అదే విష‌యాన్ని డైరెక్టర్‌కు సూచించారు. ఇప్పటికే వ‌న్ మూవీ భారీ బ‌డ్జెట్ మూవీగా మార‌డంతో ఈ మూవీ క‌లెక్షన్స్‌పై ఎన్నో సందేహాలు వెంటాడుతున్నాయి. ఎంత త్వర‌గా ఈ మూవీను పూర్తి చేస్తే అంత మంచిది, పోస్ట్ ప్రొడ‌క్షన్‌కు ఎక్కువ స‌మ‌యం తీసుకొని మూవీను అద్భుతంగా మార్చడానికి అవ‌కాశం ఉంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

అయితే వ‌న్ మూవీ షూటింగ్ న‌వంబ‌ర్ నెల‌లోనూ మూడో వారం వ‌ర‌కూ ఉంటుంద‌ని టాలీవుడ్ స‌మాచారం. వ‌న్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అని ఖ‌న్‌ఫ‌ర్మ్ కావ‌డంతో మూవీ షూటింగ్ షెడ్యూల్‌ను త్వర‌గా పూర్తిచేయాల్సిందిగా డైరెక్టర్ మీద ఒత్తిడి మ‌రింత‌గా పెరుగుతుంద‌ని చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం. ఎప్పుడో పూర్తి కావల్సిన మూవీ ఇప్పటి వ‌ర‌కూ పూర్తి కాక‌పోవ‌డంతో సుకుమార్‌పైనా మ‌హేష్‌బాబు కొద్దిగా అస‌హ‌నంగా ఉన్నాడ‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: