పవన్ రాజకీయ ప్రేవేశం చర్చలు ఒక వైపు జతుగుతూ ఉండగానే అవేమి తనకు సంబంధం లేదు అన్నట్లు గా పవన్ తన ‘గబ్బర్ సింగ్- 2’ స్క్రిప్ట్ ఫై పూర్తిగా ద్రుష్టి పెట్టాడు. ప్రస్తుతం కొంతమంది యువరచయితల బృoదం పవన్ సూచనలతో ఈ సినిమా స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచస్ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సబంధించి మొట్టమొదటి క్లాప్ కూడా పడకుండా కనీసం స్క్రిప్ట్ కూడా పూర్తి కాని ఈ సినిమాకు అప్పుడే బయ్యర్లు నుండి వస్తున్న ఫాన్సీ ఆఫర్స్ టాలీవుడ్ ట్రేడ్ పండితులకు మైండ్ బ్లోయింగ్ గా తయారు అవుతున్నాయని టాక్.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు నైజాం ఏరియా నుండి 16 కోట్లకు ఆఫర్ వచ్చిందట. ఇది పవన్ సినిమాలకు ఇప్పటి వరకూ ఏ సినిమాకు రాని ఆఫర్ అని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం పవన్ ‘అత్తారిల్లు’ ఇప్పటికే నైజాం ఏరియాలో 22 కోట్లు చేయడం పవన్ గబ్బర్ సింగ్ సీక్వెల్ కు ఇలాంటి ఫాన్సీ రెట్లు వచ్చేటట్లుగా చేసిందని అంటున్నారు. అదేవిధంగా కోస్తా, సీడెడ్ జిల్లాల నుండి ఈ సినిమాకు ఇప్పటి వరకు ఏసినిమాకు రాని ఆఫర్లు రావడం పవన్ ను ఆశ్చర్య పరుస్తోందట. ఇంత తీవ్ర స్థాయిలో ఈ సినిమాకు అంచనాలు పెరిగి పోవడంతో ఈసినిమా స్క్రిప్ట్ విషయం పై చాల జాగ్రత్తలు పవన్ తీసుకుంటున్నాడని టాక్.

అదేవిధంగా రకరకాల హీరోయిన్స్ పేర్లను పరిశీలించిన పవన్ తన ఓటును ఒక కొత్త అమ్మాయికి వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఎవరూ అనేది ఇంకా బయటకు రాలేదు. రిలీజ్ కాకుండానే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: