రాజమౌళి దర్శకత్వములో ప్రభాస్, రానా, అనుష్క నటించిన బాహుబలి మేకింగ్ వీడియో ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. విడుదలయిన కొద్ది నిమిషాలలోనే YOUTUBE లో చుసిన వారి సంఖ్య పెరుగుతూ ఉంది.

ఇక మేకింగ్ వీడియో చుసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం ఒక్కటే, బాహుబలితో రాజమౌళి దేశంలోనే టాప్ దర్శకునిగా నిలవటం ఖాయం. ప్రభాస్, రాజు వేషం లో అద్భుతంగా ఉన్నాడు. కత్తి తిప్పే సన్నివేశం చాలా బావుంది. మిర్చి లో చెప్పిన “నేను కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేడు” అనే డైలాగ్ ని నిజం చేస్తున్నట్లుంది ప్రభాస్. కీరవాణి నేపధ్య సంగీతం కూడా సినిమాకి మంచి హైలెట్ అయ్యేలా కనబడుతుంది. మేకింగ్ లో వచ్చిన సంగీతం హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది. సినిమా మేకింగే ఇలా ఉందంటే ఇక సినిమా విడుదల అయితే తెలుగు సిని చరిత్రలోనే కాదు , భారత సిని చరిత్ర లో ఉన్న మొత్తం రికార్డ్స్ బ్రేక్ అవ్వటం ఖాయం అని సినివర్గాలు చెప్పుకుంటున్నారు.

‘ఈగ’ సినిమాతో టెక్నాలజీని కూడా తనదైన శైలిలో జక్కన్న వినియోగించుకొని బంపర్ హిట్ కొట్టాడు. అయితే బాహుబలితో మరోసారి తన స్టామిన ఏంటో నిరుపించబోతున్నాడు. ఏది ఏమైనా జక్కన మన తెలుగువాడు అవ్వటం మనందరం గర్వించ తగిన విషయం. WAY TO GO RAJAMOULI.

మరింత సమాచారం తెలుసుకోండి: