ప్రభాసా మజాకా... అంటూ నిరూపించాడు అంటున్నారు టాలీవుడ్ లో. కారణం ప్రభాస్ తప్ప మరొకరు బాహుబలి పాత్రకు సెట్ అవ్వరు అంటూ తన పుట్టిన రోజు తేల్చేసాడట ప్రభాస్. చత్రపతి అంటే ఎలా ఉండాలో చూపించిన ప్రభాస్ ఇప్పుడు బాహుబలి అంటే ఎలా ఉంటాడో మరోసారి చూపించాడు, అందరితో కేక పెట్టించాడు అంటున్నారు.

నిజమే ఆరుడగులు దాటిన ఎత్తు, మెలికలు తిరిగిన కండరాలు, ఆజానుబాహుడు, అదిరిపోయే ఆకారం ఎవరికి ఉందంటే సినిమా రంగం మొత్తం మీద అందరి నోట వినిపించే మాట అతడే ప్రభాస్ అని. రాజమౌళి కూడా అదే రుజువు చేసాడు అంటున్నారు.

ప్రభాస్ జన్మదినం సంధర్భంగా విడుదల చేసిన బాహుబలి మేకింగ్ టీజర్ లో ప్రభాస్ గెటప్, లుక్స్ నిజంగా అదరగొట్టింది అంటున్నారు. ఈ టీజర్ లో అలా కన్పించి ఇలా మాయమైన ఆ కొద్ది క్షణాల్లోనే ప్రభాస్ అదరగొడితే ఇంకా సినిమా మొత్తంలో ప్రభాస్ ఎంత ఇరగదీసాడో అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: