అందరినీ ఏదో ఒకటి కామెంట్ చేసి విసిగిస్తూ ఉంటాడు వర్మ. మొదట్లో కొందరు ఇరిటేట్ అయినా... ఇక అతడి నేచర్ అంతే అంటూ పట్టించుకోవడం మానేశారు. అయినా మనోడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడనుకోండి. అయితే తాజాగా నిర్మాత అరుణ్ కుమార్ తో కూడా ఏదో గొడవ పెట్టుకున్నాడట మనోడు. దాంతో ఏకంగా సినిమానే వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.ప్రస్తుతం వర్మ సత్య 2 చిత్రాన్ని తీస్తోన్న సంగతి తెలిసిందే కదా! తను ముంబై వెళ్లిన కొత్తలో గమనించిన విషయాలను, ముంబైలో పరిస్థితులను ఆధారంగా చేసుకుని సత్య సినిమా తీశారు వర్మ. అది సక్సెస్ అయ్యింది. దాంతో ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎం.సుమంత్ కుమార్ రెడ్డి, అరుణ్ కుమార్లు నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఆడియో వేడుక కూడా ఘనంగా జరిగింది. అయితే ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ, సినిమా సడెన్ గా వాయిదా పడింది. కారణం ఏమిటి అంటే... అరుణ్ కీ, నాకూ మనస్పర్థలు వచ్చాయి, అతణ్ని సినిమా నుంచి తొలగించాం, అందుకే సినిమా వాయిదా పడింది అన్నాడు వర్మ. 

అయితే అందరూ అనుకునేదేమిటంటే... వర్మ పద్ధతి అరుణ్ కి అంతగా నచ్చలేదట. మనవాడు అన్నిటికీ మొండిగా మాట్లాడటం, తనకు నచ్చినట్టే చేస్తాననడం వంటి వాటి విషయంలో అరుణ్ హర్ట్ అయ్యాడని, అందుకే ఇద్దరికీ మాటా మాటా వచ్చిందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మనోడు నిర్మాతలను కూడా విసిగించడం మొదలెట్టాడన్నమాట అంటూ కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. అయినా వర్మ సంగతి తెలియనివారెవరున్నారు! తెలిసి సినిమా తీయాలని ముందుకెళ్లినప్పుడు అడ్జస్ట్ అయిపోవాలి. ఇలా గొడవలు పెట్టుకుని పనిని చెడగొట్టుకుంటే ఎలా!

మరింత సమాచారం తెలుసుకోండి: