మహేష్ బాబు త్వరలో సెట్స్ లోకి వెల్లనున్న ‘ఆగడు’ సినిమాలో ఆయన పాత్రేంటో బయటపడింది అంటున్నారు టాలీవుడ్ లో. ఇప్పటికే మహేష్ రెండు సూపర్ హిట్లు ఇచ్చిన ఆ పాత్రనే మరోహిట్టు కోసం ‘ఆగడు’ లో ఎంచుకున్నాడట. ఆయన సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో సంక్రాంతికి వెండితెరపైకి వస్తున్నాడు మహేష్, ఆవెంటనే ‘ఆగడు’ కోసం సెట్స్ లోకి వెలుతున్నాడు, ఈ సినిమాలో ప్రిన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. ఈ పాత్ర ఆయనకు ఇప్పటికి రెండు సార్లు కలిసి వచ్చింది. పోకిరి, దూకుడు లో పోలీసు పాత్ర పోషించి బిగ్ హిట్లు సొంతం చేసుకుని అదే సెంటిమెంట్ తో మూడో హిట్టు కోసం ముందుకు పోతున్నాడట.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాకు మొదటి హీరోయిన్ గా తమన్నా ఎంపికయింది. రెండవ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఈ రోల్ కోసం ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉండగా వారిలో ఒకరైన శృతిహాసన్ ఆ పాత్రను తిరస్కరించింది. దీంతో రెండవ హీరోయిన్ గా ఎవరు వస్తారనేది కూడా ఆసక్తిగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: