ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప్రిన్స్ మ‌హేష్ బాబు టార్గెట్ చేశాడు. ముఖ్యంగా వీరిద్దరు మంచి స్నేహితులు. అయితే ప్రొఫిష‌న్‌లో మాత్రం ఇద్దరూ ఎప్పుడూ పోటీప‌డుతూనే ఉంటారు. ఎట్ ప్రెజెంట్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన మూవీ అత్తారింటికిదారేది రికార్డు క‌లెక్షన్స్‌ను కొల్లగొడుతుంటే టాలీవుడ్ రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి.

ఈ రికార్డ్స్‌ను యంగ్‌టైగ‌ర్ న‌టించిన రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ తిర‌గ‌రాస్తుందంటే, బాక్సాపీస్ వ‌ద్ద ఘోరంగా ఫెయిల్యూర్ అయింది. త‌రువాత ప‌వ‌న్ రికార్డ్స్‌ను బ‌ద్దలు కొట్టే ఏకైన మూవీ ప్రిన్స్ వ‌న్ మూవీనే అని అంటున్నారు. ఇది అభిమానుల అంచ‌నాలు కాదు. ఇండ‌స్ట్రీలోనూ ఇదే టాక్ విన‌ప‌డుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీను మ‌హేష్‌బాబు టార్గెట్ చేశాడని, ముఖ్యంగా ఓపెనింగ్ డే క‌లెక్షన్స్‌ను ప‌వ‌న్ మూవీ కంటే ఎక్కువుగా కొల్లగొట్టాల‌ని ఇప్పటికే థియోట‌ర్లకు సంబంధించిన లిస్ట్‌ను రెడీ చేసుకుంటున్నారు.

వ‌న్ మూవీ రిలీజ్ 2014, సంక్రాంతికి అయినా రెండు మూడు నెల‌ల ముందుగానే థియోట‌ర్లకు సంబంధించిన వ్వవ‌హారాన్ని మొద‌లుపెట్టారు. ఇప్పటి వ‌ర‌కూ టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు అని బాక్సాపీస్ ట్రేడ్స్ లెక్కలు చెబుతున్నా, ప‌వ‌న్‌స్టార్ ఆ లెక్కలను స‌రిచేశాడు. ఇప్పుడు ప్రిన్స్ త‌న స‌త్తా చాటి, త‌న మొద‌టి స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాల‌నుకుంటున్నట్టు టాలీవుడ్ స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: