హాట్ బ్యూటి మ‌ల్లికాశెరావ‌త్‌కి ఘోర‌ప‌రాభ‌వం ఎదుర‌య్యింది. రీసెంట్‌గా జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌తో మ‌ల్లికాకు ఏం చేయాలో అర్ధం కావ‌డంలేదు. ఇదంతా ఓ రియాలిటి షోలో జ‌రిగింది. మ‌ల్లికాశెరావ‌త్ నిర్వహిస్తున్న బ్యాచుల‌రేట్ ఇండియా అనే రియాలిటి షోలో మ‌ల్లికా ప్రవ‌ర్తన‌పై నిర‌స‌న‌లు ఎదుర‌వుతున్నాయి.

ఈ రియాలిటిషోలో పార్టిసిపెట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ నుండి మ‌ల్లికాపై తీవ్ర నిర‌స‌న‌లు ఎదుర‌వుతున్నాయి. ఈ రియాలిటి షో ప్రధాన ఉద్ధేశం ఏంటంటే డేటింగ్ క‌ల్ఛర్‌ను మ‌రింత ఎక్స్‌పోజ్ చేయ‌ట‌మే. అమెరిక‌న్ దేశాల‌లో ప్రాముఖ్యత చెందిన ఓ డేటింగ్ రియాలిటి షోని ఆధారం చేసుకొని ఇండియాలో ఈ 'బ్యాచుల‌రేట్ ఇండియా' రియాలిటి షోను నిర్వహిస్తున్నారు. ఇందులో మ‌ల్లికాశెరావ‌త్‌కి పార్టిసిపెంట్స్‌కి అస్సలు ప‌డ‌టం లేదు. వారి మ‌ధ్య ఎన్నో మ‌నస్ఫర్ధలు వ‌స్తున్నాయి. వ‌చ్చిన పార్టిసిపెంట్స్‌ని మ‌రింత‌ అవ‌మాన ప‌రుస్తుంద‌ట‌.

దీంతో మ‌ల్లికాశెరావ‌త్‌ను ఆ రియాలిటి షో నుండి వెళ్ళి పోవాల్సిందిగా నిర్వాహ‌కులు ఆర్డర్ వేశారు. దీంతో షో మ‌ధ్య నుండే మ‌ల్లికా వెళ్ళిపోయింది. త‌రువాత కొంత మంది వెళ్ళి బ‌తిమిలాడినా మ‌ల్లికా శెరావ‌త్ రియాలిటి షోకి తిరిగి రావ‌టానికి నిరాక‌రించిందంట‌. రియాలిటి షో నిర్వాహ‌కులకి మ‌ల్లికా శెరావ‌త్ మ‌ధ్య చివ‌ర‌గా ఏం జ‌రుగుతుందో అనేది బాలీవుడ్‌లో ఆస‌క్తి నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: