యోగా బ్యూటీ అనుష్కా, ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘రుద్రమదేవి'. శర వేగంగా నిర్మాణం జరుగుతోంది. కాకతీయ సామ్రాజ్య చరిత్రలో రాణి రుద్రమది ఒక సువర్ణాధ్యాయం. గజ పతుల పాలనను ఎదిరించిన వీర వనితగా చరిత్రలో ఈమె స్థానం సుస్థిరం. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ధైర్యం గా నిర్మిస్తున్న ఈసినిమా లో రాణి రుద్రమ్మగా అనుష్క అద్వితీయంగా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అనుష్కగెటప్ కు సంబందించి తాజా ఫోటో ఒకటి బయటకు లీకైంది. ప్రస్తుతం ఈ ఫోటో వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రాణీ రుద్రమ ఆకారం నూనూగు మీసాలతో మగ రాయుడిలా ఉంటాడని అంటారు. అది దృష్టిలో పెట్టుకునే కాబోలు దర్శకుడు గుణ శేఖర్ అనుష్కను ఒక మొగ రాయుడిలా తీర్చిదిద్ది డిఫరెంట్ గా చుపెడుతున్నాడు. డిసెంబర్ లో జరిగే చివరి షెడ్యూల్ తో ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో విడుదల చేసే ఉద్దేశ్యంలో గుణశేకర్ ఉన్నాడట. అనుష్క కెరియర్ ను ఈ సినిమా ఒక మలుపు తిప్పుతుంది అని విశ్లేషకులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: