నిన్న విడుదలైన 96 సెకండ్ల ‘బాహుబలి’ మేకింగ్ టీజర్ విడుదలైన కేవలం 20 గంటలలో 3 లక్షల హిట్స్ ను సాధించుకుని ఎప్పుడో రెండు సంవత్సరాల తరువాత విడుదలయే సినిమాకు నిన్నటి నుంచే పబ్లిసిటీకి తెరతీసింది. ‘ఎ జర్నీ ఇంటూ ది మేకింగ్ ఆఫ్ బాహుబలి’ పేరుతో విడుదలైన ఈ టీజర్ లో ఈసినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణులను హైలెట్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ సన్నివేశాల రిహార్సల్స్ ను చూపెడుతూ ఒకేసారి ప్రభాస్ వీరుడిగా అదర కొట్టే లుక్కు తో ముగిస్తుంది. ఈ టీజర్ విడుదలైన వెంటనే రాజమౌళి ఫోనుకు విరామం లేకుండా అభినందన ఫోన్స్ వేలాది సంఖ్య లో అభినందన సందేశాలు వచ్చి పడ్డాయట. అయితే రాజమౌళి మాత్రం ఈ టీజర్ రూపొందించిన ఘనత తనది కాదు అంటూ అసలు విషయం బయట పెట్టాడు. ప్రభాస్ అభిమానులకు పరిశ్రమ పెద్దలకూ ఎంతగానో నచ్చిన ఈ టీజర్ ను రాజమౌళి కుమారుడు కార్తికేయ రూపొందించాడట. దీనికి కారణం కార్తికేయ ‘షూటింగ్ బిహైండ్ సీన్స్ ఆఫ్ ఫిలిమ్స్’ అనే వ్యాపార సంస్థను ఈ మధ్య ప్రారంభించాడట. ఈ సంస్థ తరఫున కార్తికేయ ‘బాహుబలి’ టీజర్ ను రూపోందించాడని ఈ గొప్పతనం అంతా కార్తికేయకే చెల్లుతుందని రాజమౌళి చెపుతున్నారు. ఇప్పటికే అనేక షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తన క్రియేటివిటీ చాటుకుంటున్న కార్తికేయ నాగార్జున కుమారుడు అఖిల్ తో ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎదిఎమైనా రాజమౌళి వారసుడు రంగం లోకి దిగినట్లే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: