మాస్ మహారాజా రవితేజా ఏకంగా వరస పెట్టి ఆరు ఫ్లాప్ లు చుసిన తరువాత దశ తిరిగి ‘బలుపు’ సినిమా తో అదృష్టాన్ని అందుకున్నాడు. వరస పెట్టి సినిమా పై సినిమాలు చేసే రవితేజా ‘బలుపు’ సినిమా విజియాన్ని ఇచ్చినా ఆ తరువాత వరస పెట్టి కధలు విన్నాడే తప్పించి ఏ కధకు అధికారకంగా ఓకె చేయలేదు. నాలుగు నెలలు నుంచి వంద లెక్కలు వేసి రకరకాల పరీక్షలు చేసి చివరకు ఫెయిల్యూర్ డైరెక్టర్ గా పేరు పొందిన బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రవితేజా అంగీకరించాడు అనే వార్తలు టాలీవుడ్ లో వినిపించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత అనుభవం ఉన్న రవితేజా తప్పటడుగులు వేస్తున్నాడు అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.  ఈ సినిమాను రవితేజా తన స్నేహితుడు , నిర్మాత వైవీఎస్ చౌదరికి ఇచ్చిన మాట కోసం చేస్తున్నాడు అంటు వార్తలు వచ్చాయి. గతసంవత్సరం చౌదరి రావితేజాతో ‘నిప్పు’ సినిమా తీసి చేయి కాల్చుకోవడంతో తన మిత్రుడు చౌదరికి సహాయం చేద్దామని రవితేజా అనుకున్నాడట. దానికోసమే బాబి దర్సకత్వంలో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపాడట. అయితే వైవీఎస్. చౌదరి ఈ సినిమాకు సంబంధించి పెట్టుబడి సమకూర్చుకోవటం ఆలస్యం అవుతూ ఉండటంతో కేలెండర్ లో నెలలు వరుస పెట్టి తిరిగిపోతూ అటు వైవీఎస్. చౌదరి సినిమా ప్రారంభం కాక, మరో కొత్త సినిమా చేతిలో లేక ‘బలుపు’ ఇచ్చిన అనందం ఆవిరైపోతోందని మన మాస్ మహారాజా తెగ టెన్షన్ పడుతున్నాడట. మొన్నటిదాకా హిట్స్ లేక ఇప్పుడు హిట్ ఉన్నా చేతిలో సినిమాలు లేని విచిత్రమైన పరిస్థితిలో రవితేజా ఉన్నాడు అంటూ ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: