తెలుగులో ఇప్పుడొ కొత్త సెంటిమెంట్ ప్రాంర‌భం అయ్యింది. ఇది హీరోల‌తో పాటు..ద‌ర్శక నిర్మాత‌ల‌కు కూడా గ‌ట్టిగా మైండ్ లో పాత‌కుపోయింది. ఇంత‌కు ఈ సెంటిమెంట్ ఏంటో తెలుసా..! ఏదైన ఒక సినిమా విజ‌యం సాధిస్తే.. అతే టీమ్ తో మ‌ళ్లీ..అదే త‌ర‌హా క‌థ‌తో సినిమా చేయ‌డం. గ‌తంలో కూడా ఈ ట్రెండ్ ఉండేది. అయితే కేవ‌లం ఆ త‌ర‌హాలో క‌థ‌ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యేది. అయితే ఇప్పడిది క‌థ తో పాటు ..కాంబినేష‌న్ కు కూడా ఎక్స్ టెండ్ అయ్యింది ఈ యేడాది నిఖిల్ .స్వాతి లీడ్ రోల్స్ లో "స్వామిరారా" సినిమా స‌క్సెస్ అయ్యింది. గ‌త యేడాది నితిన్ , నీత్యామీన‌న్ న‌టించిన ఇష్క్.. ఈ మ‌ధ్య స‌మంత్..ఆశ్విన్.. ఇషా లీడ్ రోల్స్ లో చిన్న చిత్రాలు విజ‌య వంతం అయ్యాయి. దీంతో .. ద‌ర్శక నిర్మాత‌లు ఈ జంట‌ల‌తో .. సినిమాలు చేయ‌డానికి మ‌క్కువు చూపుతున్నారు. అయితే క‌థ‌ల విష‌యంలో కూడా పెద్ద మార్పు లేకుండా . వాళ్లు న‌టించిన గత చిత్రాల త‌ర‌హా క‌థ‌ల‌తోనే సినిమాలు చేస్తున్నారు. ఇదే త‌ర‌హాలో నిఖిల్.స్వాతి ల తో శేఖ‌ర్ చంద్ర అనే డైరెక్టర్ చేస్తున్న "కార్తీకేయ" చిత్రం స్వామిరారా త‌ర‌హా క‌థ‌, క‌థ‌నంతోనే తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం త‌మిళ‌నాడు లో ప్రసిద్ద దేవాల‌య‌ల్లో జ‌ర‌గుతుంది. హీరో, హీరోయిన్ మీదున్న కీల‌క స‌న్నివేశాలు షూట్ చే్స్తున్నారు. ఈ సినిమాను త‌మిళ్ లో కూడా చేస్తున్నారు.నిఖిల్ కు ఇది మొద‌టి ద్విభాష సినిమా అని చెప్పాలి. మ‌రి ఒక సినిమా స‌క్సెస్ అయ్యింది కాదని..అదే త‌ర‌హా క‌థ‌తో సేమ్ కాస్టింగ్ తో చేస్తున్న ఈ ప్రయోగాలు ఎంత వ‌ర‌కు విజ‌య‌వంతం అవుతాయో..! వేచి చూడాల్సిందే.     

మరింత సమాచారం తెలుసుకోండి: