టాలీవుడ్‌లోని హీరోలు ఎన్నో ర‌కాల పాత్రల‌తో ప్రేక్షకుల‌ను మెప్పించారు. కాని ఈ త‌రం న‌టుల్లో మ‌గ‌ధీరుడుగా రామ్‌చ‌ర‌ణ్ డిప్రెంట్ లుక్‌తో సినీ జ‌నాల‌ను మ‌రింత ఇంప్రెస్ చేశాడు. మ‌గ‌ధీర సృష్ఠిక‌ర్త రాజ‌మౌళి. రాజ‌మౌళి మార్క్‌తో తెర‌కెక్కిన మూవీ మ‌గ‌ధీర కావ‌డంతో చ‌ర‌ణ్‌కు అంత క్రేజ్ వ‌చ్చింద‌నేది ఇండ‌స్ట్రీ టాక్‌. ఏవ‌రేమ‌నుకున్నా రామ్‌చ‌ర‌ణ్ మ‌గ‌ధీర మూవీలో ఆ పాత్రకు త‌గ్గ న్యాయాన్ని చేశాడు. ఆ త‌ర‌హా గెట‌ప్‌లో ఎవ‌రు క‌నిపించినా మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది రామ్‌చ‌ర‌ణే. లేటెస్ట్‌గా రాజ‌మౌళి ద‌ర్శక‌త్వం నుండి వ‌స్తున్న మ‌రో మూవీ బ‌హుబ‌లి. బాహుబ‌లి మూవీలో ప్రధాన పాత్రను పోషిస్తున్న న‌టుడు ప్రభాస్‌. ప్రభాస్ పుట్టిన రోజున నాడు రిలీజ్ అయిన బాహుబ‌లి ఫ‌స్ట్ లుక్‌లో ప్రభాస్ అదుర్స్ అనిపించాడ‌ని అభిమానులు అంటున్న మాట‌. కాని ప్రభాస్‌ను ఆ గెట‌ప్‌లో చూస్తున్న వారికి మ‌గ‌ధీరలోని రామ్‌చ‌ర‌ణ్ గెట‌ప్ గుర్తుకు వ‌స్తుందంటున్నారు. ప్రభాస్ కంటే చ‌ర‌ణ్‌కే ఆ గెట‌ప్ క‌రెక్ట్‌గా ఉంద‌ని చాలా మంది మాట‌. ప్రభాస్ బాడీను ప‌క్కప పెడితే రాజు గెట‌ప్‌లో ప్రభాస్ కంటే చ‌ర‌ణ్ గెట‌ప్ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటుంద‌ని, ప్రభాస్ లుక్‌ను చూస్తుంటే అంద‌రికీ చ‌ర‌ణ్ గుర్తుకువ‌స్తున్నాడంటూ ఇండ‌స్ట్రీలోనూ టాక్ వినిపిస్తుంది. ఈ విష‌యం తెలుసుకున్న రాజ‌మౌళి, ప్రేక్షకుల‌కు అటువంటి ఫీలింగ్స్‌ను క‌ల‌క‌గ‌కుండా జాగ్రత్త తీసుకుంటున్నట్టు స‌మాచారం. ఎందుకంటే ఆ త‌ర‌హా ఫీలింగ్స్ ప్రేక్షకుల‌కు వ‌చ్చాయంటే ఒక డైరెక్టర్‌గా రాజ‌మౌళి ప్రతిభ త‌గ్గిన‌ట్టే. అందుకే మ‌గ‌ధీర మూవీకు సంబంధించిన ఎటువంటి లుక్స్‌ను బాహుబ‌లి మూవీలో క‌న‌ప‌డ‌కుండా చూసుకునేందుకు మ‌రింత జాగ్రత్తప‌డుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: