రంగం సినిమాతో తెలుగు ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అయిన త‌మిళ హీరో జీవ.. ఇప్పుడొక స‌క్సెస్ కోసం ప‌రితిప‌స్తున్న విష‌యం తెలిసిందే. ఎందుకంటే..రంగం సినిమా త‌రువాత ఈ హీరో చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గర గ‌ల్లంతు అయ్యాయి. అందుకే తాజాగా "ఎంద్రుడ‌మ్ ఎన్నాగై" అనే సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం ఆడియో విడుద‌ల  ఈనెల 18 న చెన్నై లో గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది.  హారీ ష్ జ‌య‌రాజ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు చిత్ర ద‌ర్శకుడు. అయితే ఈ సినిమా ఒక సెన్సిటివ్ ల‌వ్ స్టోరి గా చేశార‌ట‌. క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తుంద‌ని ఆశిస్తున్నారు చిత్ర యూనిట్. డిసెంబ‌ర్ లో ఈ సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: