ప్రభాస్ పుట్టిన రోజున‌ ఎంతో హైప్ క్రియోట్ చేసి రిలీజ్ చేసిన బాహుబ‌లి ఫ‌స్ట్‌లుక్‌కి విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. అభిమానుల కానుక‌గా రిలీజ్ చేసిన బాహుబ‌లి ఫ‌స్ట్ లుక్ యూట్యూబ్‌లోనూ సంచ‌ల‌నాన్ని క్రియోట్ చేస్తుంది. కేవ‌లం ఒక్కరోజులోనే బాహుబ‌లి ఫ‌స్ట్‌లుక్‌ను యూ ట్యూబ్‌లో నాలుగు ల‌క్షల మంది వీక్షించారు.  ఒకే ఒక్క రోజులో బాహుబ‌లికి ఇంత రెస్పాన్స్ రావ‌డంతో ఈ మూవీపై సినీ అభిమానుల్లో ఎంత‌టి అభిమానం ఉందో అర్ధం అవుతుంది. ముఖ్యంగా ఈ వీడియోకు వ‌చ్చిన‌ హిట్స్‌ను చూసి రాజ‌మౌళి తెగ సంతోష‌ప‌డుతున్నాడంట‌. అలాగే చిత్ర యూనిట్ కూడ సంతోషంతో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అభిమానుల్లో బాహుబ‌లి మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయ‌న్నది యూట్యూబ్ వీడియోకు వ‌చ్చిన హిట్టింగ్స్‌ను చూస్తేనే తెలిసిపోతుందని రాజ‌మౌళి స‌న్నిహితుల‌తో చెబుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: