పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రహసనం అంతా ఇంతా కాదు. 90 నిమిషాల నిడివిగల సినిమా పైరసీ రూపంలో బయటకి వచ్చేసింది, అసలు సినిమా విడుదల అయితే చాలనుకున్నారు దర్శక నిర్మాతలు. మూలుగుతున్న నక్క పై తాటికాయ పడ్డట్టుగా సినిమా విడుదల సమయానికి రాష్ట్రంలో సమైక్య ఉద్యమం తారస్థాయిలో నడుస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్తితుల మద్య విడుదలైతే చాలు అనుకున్న సినిమ ఈ రోజున సంచలనాలు సృష్టిస్తుంది.    ఇంతకి విషయం ఏమిటంటే, అత్తారింటికి దారేది 4 వారాలు పూర్తికాక ముందే మగదీరని దాటేసింది. ఇప్పుడు అందరి దృష్టి 100 కోట్లపై పడింది, ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని దాటుతుందని నిర్మాత ప్రసాద్ ఈ మధ్య జరిగిన విలేకరుల సమావేశం లో చెప్పటం జరిగింది. మాములుగా బాలీవుడ్ సినిమాలు 100 కోట్లు సాదించగలవు, ఎందుకంటే అవి విడుదలయ్యే హాల్స్ ఎక్కువ, వాటి పరిధి కూడా ఎక్కువ, కాని మన తెలుగు సినిమా మన దగ్గర మినహా మహా అయితే కర్ణాటక, తమిళ్ నాడు లో విడుదల అవుతుంది. మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిన 60 – 70 కోట్లు దాటటం చాల కష్టం.  కాని అత్తారింటికి దారేది వెళ్తున్న తీరు చూస్తుంటే, 100 కోట్ల మార్క్ దాటేలానే కనపడుతుంది. పైగా పెరిగిన డాలర్, టికెట్ విలువ, వీటన్నిటికన్నా పవర్ స్టార్ ఇమేజ్ ఈ సినిమాని 100 కోట్లు చేర్చటం ఖాయంగా కనిపిస్తుంది. ఇవాల్టి నుండి కొన్ని కొత్త సన్నివేశాలు కూడా జత చేర్చారు. దీనివలన సినిమా చూడటానికి అభిమానులు మళ్ళీ హాల్స్ బాట పట్టటం ఖాయం. అందున రికార్డ్స్ గురించి పట్టించుకోని పవర్ స్టార్ నోటి నుండి మొదటి సరి 100 కోట్ల మాట వినపడింది థాంక్స్ మీట్ లో. ఏదేమైనా మన తెలుగు సినిమా 100 కోట్లు కొల్లగోట్టటం అంటే గొప్పవిషయమే కదా పరిశ్రమకి.    

మరింత సమాచారం తెలుసుకోండి: