భారతీయ సినీ సంగీతాన్ని ఒక్క ఊపు ఊపాడు రెహమాన్. చిన్న వయసులోనే అపరిమితమైన సంగీత జ్ఞానంతో మహామహులను సైతం ఆశ్చర్యపరిచాడు. ఎందరికో అందని కల అయిన ఆస్కారును అతి సునాయాసంగా పట్టుకొచ్చేశాడు. ఇప్పడతడు మరో రకంగా తన టాలెంటును ప్రూవ్ చేస్తుకోవాలనుకుంటున్నాడు.సంగీతంతో ఎవ్వరూ ఊహించని విచిత్రాలు చేసిన మ్యూజిక్ మాంత్రికుడు ఇప్పుడు నిజంగానే ఓ విచిత్రం చేస్తున్నాడు. ఓ సినిమాకి కథ అందించనున్నాడు. విదేశాల్లో రికార్డింగులకు, షోలకు వెళ్లినప్పుడు ఎదురైన అనుభవాలన్నింటినీ రంగరించి ఓ కథను సిద్ధం చేస్తున్నాడట రెహమాన్. వాటికి తెర రూపం కూడా ఇస్తాడట. అయితే దర్శకత్వం మాత్రం వహించనని... కేవలం నిర్మాతగాను, రచయితగా మాత్రమే వ్యవహరిస్తానని చెబుతున్నాడు. ఈ విషయం వినగానే రెహమాన్ లో రచయిత కూడా ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నాడు. అన్నీ సమకూరితే త్వరలోనే చిత్రాన్ని తెర మీదకు తీసుకెళ్తానని అంటున్న రెహమాన్, ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఎగ్జయిటవుతున్నాడు. నిజానికి తనలో ఒక రచయిత ఉన్నాడని రెహమాన్ కు కూడా తెలీదట. మూడేళ్ల క్రితం నీ అనుభవాలను అక్షరాలుగా మార్చు అంటూ కొందరు స్నేహితులు చెప్పారట. అప్పట్నుంచే రాయడం మొదలు పెట్టాడట. సంగీతంలో ఎలాగూ సంచలనాలు సృష్టించేశాడు. మరి రచయితగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి!  

మరింత సమాచారం తెలుసుకోండి: