క్యూట్ హీరోయిన్ సమంత మంచి న‌టిగానే కాదు, స‌మాజంపై అవగాహనతో పాటు బాధ్యత ఉన్న అమ్మాయిగా తాను ఉన్నతస్థితిలో ఉండి కూడా సమాజానికి ఏదోఒకటి చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే సమాజం పట్ల అటువంటి తపన కలిగిన పవన్ కు విపరీతంగా నచ్చేసింది. అంతేకాదు 'అత్తారింటికి దారేది' స‌క్సెస్ మీట్‌లో సమంత‌ని ఆయ‌న ఆకాశానికి ఎత్తేశారు. స‌మంత‌లోని మంచిత‌నం త‌న‌ని క‌ద‌ల్చివేసింద‌ని చెప్పారు.  ఈ మాట‌ల‌కు స‌మంత తెగ సంబ‌ర ప‌డిపోతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తన అభిమాన న‌టుడనీ అంటూ ఆయ‌న వ్యక్తిత్వం ముందు తనెంత అని అంటోంది. అంతేకాదు అలాంటి మంచి మ‌నిషి తన గురించి నాలుగు మంచి మాట‌లు చెబుతుంటే చాలా గ‌ర్వంగా అనిపిస్తోందని అంటూ నిజానికి పవన్ పొగడ్తల కంటే గొప్ప అవార్డు ఈ ప్రపంచంలో ఏది ఉండదు అని చెపుతోంది సమంత.  పవన్ ఇమేజ్ ని కేష్ చేసుకుని కొంతమంది నిర్మాతలూ, పవన్ డైలాగ్స్, పాటలు వాడుకుని మరికొంతమంది హీరోలు సక్సస్ అవుతూ ఉంటే పవన్ పొగడ్తలను జాతీయస్థాయి అవార్డు గా భావించి సమంత మరో అడుగు ముందుకేసింది, దట్ ఈజ్ పవనిజమ్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: