లేటెస్ట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయింది. మూవీ నెల‌రోజుల‌కు ద‌గ్గర‌ప‌డ‌టంతో ఆ మూవీకు సంబంధించిన ఒక పోస్టర్‌ను బ‌య‌ట‌కు రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌పై 'బిగ్గెస్ట్ హిట్ ఇన్ 100 ఇయ‌ర్స్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా' అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.   పోస్టర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నప్పటికీ, అంద‌రి క‌న్ను దాని ప‌క్కనే ఉన్న ఇండియ‌న్ సినిమా అనే లైన్‌పైనే ఉంది. అత్తారింటి మూవీ అనేది రీజ‌న‌ల్ ఫిల్మ్‌. ఇండియ‌న్ సినిమాలో టాలీవుడ్ ఒక భాగ‌మైన‌ప్పటికి, ఈ మూవీ ఇండియ‌న్ మూవీల‌తో పోల్చోకోద‌గ్గ ఘ‌న‌కార్యం అంత‌లా ఏం చేసిందో ఎవ్వరికి అర్ధం కావ‌డంలేదు. టాలీవుడ్ మూవీలో ఇదే టాప్ మూవీ అంటే ఓకే కాని, ఇండియ‌న్ మూవీల కంటే అత్తారింటికిదారేది బిగ్గెస్ట్ మూవీ అంటే ఆ పోస్టర్‌ను చూసి అంద‌రూ న‌వ్వటం మొద‌లు పెడుతున్నారు. ఇంత‌టి వివాదాస్పద‌మ‌వుతున్న ఈ పోస్టర్‌ను ఎవరు రిలీజ్ చేశారో తెలుసుకుంటే అది ఒక ప‌వ‌న్ అభిమాని చేసిన పోస్టర్‌గా తెలిసింది. పోస్టర్ ర‌చ్ఛ బ‌జారుకి ఎక్కడంతో ఆ పోస్టర్‌కు మూవీ నిర్మాత‌కు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. అభిమాని ప్రేమ‌తో చేసిన ఆ పోస్టర్ అలా చూసి వ‌దిలేయాలి త‌ప్పితే, దాన్ని బూత‌ద్ధంలో చూపెట్టి, ప‌వ‌న్‌ను త‌ప్పు ప‌ట్టడం క‌రెక్ట్ కాద‌ని చిత్ర యూనిట్‌ అంటుంది. ఏదేమైనా ఆ పోస్టర్‌లో ఇండియ‌న్ సినిమా అనేది క‌రెక్ట్ కాద‌ని యావ‌త్ టాలీవుడ్ అంటున్న మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: