రామ్ చరణ్ ఉపాసనాల పెళ్ళికి ఎందరో ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చారు. అయితే చెర్రీకి మాత్రం అతడి భార్య ఉపాసన అత్యంత ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారును చరణ్ కు ఇచ్చి అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడా కారు చరణ్ నటిస్తున్న కృష్ణవంశీ మల్టీ స్టారర్ సినిమాలో చాల ప్రముఖంగా కనిపిస్తుందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం చరణ్ తాను నటించబోయే కొత్త సినిమా కోసం ఈ కారుతో ఫోటో షూట్ లు కూడా తీయిస్తున్నాడని సమాచారం.  ఈసినిమాలో చరణ్ కొద్దిగా రఫ్ లుక్ మరియు ఈకారుతో కనిపిస్తాడట. నవంబరు నుండి ప్రారంభం కాబోతున్న ఈసినిమాలో రామ్ చరణ్ తో పాటు చెర్రీ కారు కూడా ఉంటే బాగుంటుందని కృష్ణవంశీ సూచించడంతో ఈ మల్టీస్టారర్ సినిమాలో చరణ్ కారు కూడా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు చరణ్ ఈ కారులో ట్రావెల్ చేస్తూ ఉంటే పాట కూడా ఉంటుందట.  గతంలో హీరో నాగార్జున ‘నిన్నేపెళ్ళాడుత’ సినిమాలో గ్రీకువీరుడు పాటలో అత్యంత ఖరీదైన స్వన్కీ కారులో కనపడి అప్పటి అమ్మాయిలకు గ్రీకువీరుడిగా మారినట్లు, నేడు కృష్ణవంశీ సినిమా ద్వారా చరణ్ తన ఆస్టిన్ మార్టిన్ కారులో ఈతరం అమ్మాయిలకు మరో గ్రీకువీరుడుగా కనిపించబోతున్నాడు అనుకోవాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: