ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ మంది హీరోలు డైరెక్టర్ మాట‌ల‌కు, వారి ట్రాక్ రికార్డుల‌కు ప‌డిపోతున్నారు. ఆ విధంగా తెర‌కెక్కిన మూవీలు చివ‌రికి డిజాస్టర్స్‌గా మారి ఎవ‌ర్ని త‌ప్పు ప‌ట్టాలో అర్ధం కాని ప‌రిస్థితిలా మారింది. రీసెంట్‌గా ఆ లిస్ట్‌లో నాగ‌ర్జున కూడ చేరిపోయాడు. అస‌లే ఫాంలో లేక, టాలీవుడ్ యంగ్ జ‌న‌రేష‌న్‌తో ఎలా పోటీప‌డాలో తెలియ‌కుండా ఉంటుంటే, ఈ స‌మ‌యంలో నాగ‌ర్జున‌కు డైరెక్టర్ వీర‌భ‌ద్రమ్ శ‌ఠ‌గోపురం పెట్టేశాడు. టాలీవుడ్ బ‌డా హీరోల‌లో ఒక‌రిగా ఉంటున్న నాగ‌ర్జున చేత ఎటువంటి మూవీలు తీయాలో ఈ డైరెక్టర్‌కు అస్సలు అర్ధం కాలేదు. ఓ డైరెక్టర్‌గా క‌థ‌ను ఏవిధంగా న‌డిపిస్తున్నాడో, స్ర్కీన్‌ప్లేను ఎలా రాసుకోవాలో వంటి విష‌యాల‌ను అంత‌లా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో భాయ్ మూవీకు జ‌ర‌గ‌రాని ఘోరం జ‌రిగింది. ఒక్క నాగార్జునే కాదు, ఇలాంటి ద‌ర్శకుల మాట‌ల‌కు ఈ మ‌ధ్య కాలంలో చాల మంది హీరోలు కూడ కుధేల్ అయ్యారు. వారిలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడ ఉన్నాడు. డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ మీద న‌మ్మకంతో మూవీను ఒప్పుకున్న యంగ్‌టైగ‌ర్‌కు చివ‌ర‌గా మిగిలిందే ప‌రాభ‌వ‌మే. అందుకే క‌థ తెలుసుకోకుండా కేవ‌లం స్టోరి లైన్‌తో వెళితే హీరోల‌కు చివ‌రకి మిగిలేది ఖాళీ సీట్లే అని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: