అందాల తార న‌మిత ఎంత లావుగా ఉన్నా అభిమానుల‌కు మాత్రం కొద‌వే ఉండ‌దు. న‌మిత ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం అయిన‌ప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు దానికి త్రిబుల్ టైం బాడీను పెంచేసింది. దీన్ని తెలుగులో లావు అంటే గ్లామ‌ర్ బాష‌లో మాత్రం బొద్దు అని పిలుస్తారు. మొత్తంగా న‌మిత ఎలా ఉన్నా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. లేటెస్ట్‌గా న‌మిత ఓ నిర్ణయం తీసుకుంది. కేర‌ళ వెళ్ళి త‌న లావును త‌గ్గించుకునే వైధ్యాన్ని తీసుకోబోతుంది. అంద‌రూ లావుగా ఉన్నావంటూ ప‌దే ప‌దే చెప్పడంతో, అవ‌కాశాల‌తో పాటు ఆధ‌ర‌ణ కూడ క‌రువైంది. దీంతో కేర‌ళ వెళ్ళి వైధ్యం చేయించుకోవ‌డానికి దానికి సంబంధించిన ప‌నులు అన్నింటిని పూర్తిచేసుకుంది. ఈ విష‌యాన్ని నమితే స్వయంగా చెబుతుంది. అయితే ఇంత భారీగా ఉన్న అకారం కేర‌ళ వైధ్యంతో తగ్గటానికి ఎంత కాలం ప‌డుతుందో అంటూ ఆ వివ‌రాల‌ను న‌మిత‌ను అడిగి కొంతమంది తెలుసుకుంటున్నారు. త‌ను మాత్రం త‌గ్గి చూపిస్తాను, అప్పుడే మీకు న‌మ్మకం కుదురుతుంద‌ని థీమాగా చెబుతుంది. న‌మిత స‌న్నబ‌డితే ఆ వండ‌ర్‌ను చూడాల‌ని అంద‌రితో పాటు మ‌నకూ తొంద‌ర‌గా ఉందని ఈ న్యూస్‌ను తెలుసుకున్న వారు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: