మన తెలుగు సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు రెండు స్తంభాల్లాంటివారు. ఈ ఇద్దరే మనకు పెద్ద దిక్కు. ఏఎన్నార్ తరచూ ఏదో ఒక కార్యక్రమానికి వచ్చి కాసేపు మాట్లాడి మురిపిస్తుంటారు. కానీ రామానాయుడు చాలా తక్కువ మాట్లాడతారు. అవసరమైతే తప్ప నోరు తెరవరు. కానీ తాజాగా ఆయన చాలా విషయాలు చెప్పారు. ప్రస్తుతం నేనేం చిన్నపిల్లనా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామానాయుడు. వచ్చే నెల ఎనిమిదిన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు రామానాయుడు. మీడియా సోదరులతో చాలా విషయాలు మాట్లాడారు. వచ్చే యుడు జనవరిలో వెంకటేష్, రానాలతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తీస్తారట. సూపర్ హిట్టయిన సింగ్ వర్సెస్ కౌర్ అనే పంజాబీ చిత్రాన్ని నాగచైతన్య హీరోగా రీమేక్ చేస్తారట. ప్రస్తుతం వాటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే రంగం సిద్ధం చేస్తామని చెప్పారు నాయుడు. ఈ సందర్భంగా ఆయన సినీ పరిశ్రమ తరలింపు గురించి కూడా చెప్పారు. రాష్ట్రం విడిపోతే పరిశ్రమ వైజాగ్ వెళ్లిపోతుందా అంటే, అంత సీన్ లేదన్నారాయన. ఏం జరిగినా ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, ఏం జరిగినా ఎక్కడికీ వెళ్లదు అని తేల్చేశారు. పెద్దాయన అంత కచ్చితంగా చెప్పారు అంటే ఏ ఆధారం లేకుండా చెప్పరు కదా! కచ్చితంగా అందరి మధ్య ఈ చర్చ జరిగే ఉంటుంది. వాళ్లు తేల్చిన విషయాన్నే ఆయన చెప్పివుంటారు. విభజన పరిశ్రమను ఎన్ని ఒడిదుడుకులకు లోను చేస్తుందో అంటూ పడిన టెన్షన్ కి పెద్దాయన మాటలతో కాస్త రిలీఫ్ వచ్చినట్టయ్యింది!

మరింత సమాచారం తెలుసుకోండి: