నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అభిమానుల‌కి ఓ తిపి క‌బురును చెబుతున్నాడు. రాజ‌కీయాల‌తో బిజిబిజిగా మారుతున్న బాల‌య్య, సినిమాల‌ను కూడ బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఇదిలా ఉంటే బాల‌కృష్ణ త‌న‌ అప్‌క‌మింగ్ ఫిల్మ్ లెజెండ్‌ మూవీకు సంబంధించిన ఒక తీపిక‌బురును అభిమానుల‌కి అందించ‌టానికి రెడీగా ఉన్నాడు. లెజెండ్ మూవీను డైరెక్ట్ చేస్తున్న బోయ‌పాటి శ్రీను ఆ విష‌యాన్ని అధికారింగా చెప్పే అవ‌కాశం ఉందని తెలుస్తుంది. మేట‌ర్ ఏంటంటే లెజెండ్ మూవీకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను దీపావ‌ళి కానుకుగా రిలీజ్ చేయ‌బోతున్నారు. కుదిరితే ఆ మూవీకు సంబంధించిన కొన్ని మేకింగ్ విజువ‌ల్స్‌ను కూడ అదే రోజున అభిమానుల కోసం రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ నుండి అందిన విశ్వశ‌నీయ‌మైన స‌మాచారం. సింహా కాంబినేష‌న్‌తో తెర‌కెక్కుతున్న లెజెండ్ మూవీపై అభిమానుల‌తో పాటు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ ఆస‌క్తి నెల‌కొంది. లెజెండ్ మూవీలో పొలిటిక‌ల్ ఎజెండా ఉందంటూ వస్తున్న వార్తల‌పై ఎటువంటి నిజం లేద‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: