టాలీవుడ్ సినిమా కలెక్షన్స్ కు ట్రెండ్ సెట్టర్ గా పిలవబడే రాజమౌళి తన ‘మగధీర’ రికార్డును పవన్ ‘అత్తారిల్లు’ బ్రేక్ చేసినందుకు వెరైటీగా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. మగధీర రికార్డును అత్తారింటికి దారేది చిత్రం క్రాస్ చేసింది. టీం మొత్తానికి కంగ్రాట్స్. పవన్ అభిమానులకూ కూడా కంగ్రాట్స్ అంటూ మరొక ఆశక్తికర విషయాన్ని తెలిపారు.  గతంలో ఒక మంచి తెలుగు సినిమాతీస్తే అది 100 కోట్లు వసూలుచేయడం పెద్ద కష్టం కాదని, ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఐదేళ్ల క్రితమే చెప్పితే అది అయన తనతో జోక్ చేసాడు అనుకున్నానని అంటూ, అయితే ఇప్పుడు పవన్ ‘అత్తారింటికి దారేది' చిత్రం 100 కోట్ల విషయాన్ని నిరూపించబోతోంది అంటూ రాజమౌళి పేర్కొన్నారు. అంతే కాదు ఇది కేవలం ‘అత్తారింటికి దారేది' చిత్రానికి మాత్రమే హిస్టారిక్ మూమెంటు కాదు అంటూ ఇది మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ సత్తా ఏమిటో నిరూపించే సందర్బం అనడం అయన సంస్కారానికి నిదర్సనం.  తీసిన ప్రతి సినిమాలోనూ క్వాలిటీ గురించి పరి తపించే వ్యక్తి కనుకే ఈ జక్కన్న ఒకొక్క సినిమాను రెండు సంవత్సరాలు చెక్కినా అటు హీరోలూ ఇటు ప్రేక్షకులు రాజమౌళి సినిమా గురించి వైట్ చేస్తూ ఉంటారు. పవన్ అభినందించడం రాజమౌళి గొప్పతనానికి నిదర్శనం..

మరింత సమాచారం తెలుసుకోండి: