ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ టాక్‌గా మారాడు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది కూడ చాలా త‌క్కువే. ఓవ‌రాల్‌గా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే హాట్‌టాపిక్‌గా నిలిచాడు. ఎందుకంటే ఒక రీజన‌ల్ ఫిల్మ్ వంద కోట్ల క‌లెక్షన్స్‌గా దూసుకుపోతుంటే అన్ని ఇండ‌స్ట్రీ వారు అత్తారింటికిదారేది మూవీ వైపు ఆస‌క్తిగా చూస్తున్నారు. ఒక తెలుగు సినిమా వంద కోట్ల క‌లెక్షన్స్‌ను కొల్లగొడుతుందా అనే దాన్ని ఊహించ‌డ‌మే పెద్ద జోక్‌గా మ‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీ భావించింది. అలా భావించిన వారితో జ‌క్కన్న రాజమౌళి కూడ ఉన్నారు. ఇదే విష‌యాన్ని రాజ‌మౌళి స్వయంగా వివ‌రించాడు. రాజ‌మౌళి,చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌గ‌ధీర మూవీ ఇప్పటి వ‌ర‌కూ టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ మూవీ. ఆ మూవీ సాధించిన‌ రికార్డును తిర‌గ‌రాయాలంటే మ‌ళ్ళీ రాజ‌మౌళీకే సాధ్యం అని అంద‌రూ అనుకున్నారు. కాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం చాలా సునాయ‌సంగా మ‌గ‌ధీరా మూవీ క‌లెక్షన్స్‌ను క్రాస్ చేయ‌డ‌మే కాకుండా, వంద కోట్ల క్లబ్‌లోకి మొద‌టిసారిగా అడుగుపెడుతున్నాడు. దీంతో రాజ‌మౌళికు ఒకింత ఆనందం, మ‌రోవైపు బాధ రెండు వ‌స్తున్నాయి. మ‌గ‌ధీర మూవీను ఏ మూవీ క్రాస్ చేయ‌డం అంత సులువు కాదు అనుకున్న రాజ‌మౌళికి ప‌వ‌న్ అత్తారింటికి దారేది మూవీ షాక్ ఇచ్చింది. ఈ మూవీ రికార్డ్‌ను తిర‌గ‌రాయాలంటే బాహుబ‌లి మూవీకే సాధ్యం. అందుకే బాహుబ‌లి మూవీకు మొద‌టి టార్గెట్ అత్తారింటికిదారేది క‌లెక్షన్స్‌. ఈ విధంగా రాజ‌మౌళి త‌న మైండ్‌లో ప‌వ‌న్‌ను టార్గెట్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: