ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ వెంట ఇప్పుడు వెల‌క‌ట్టలేని అభిమాన బ‌లం ఉంది. ప‌వ‌న్ మాట కోసం, ప‌వ‌న్ బాట కోసం ఇప్పుడు ప‌వ‌నిజం ఎదురుచూస్తుంది. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల ఆవేద‌న కాదు, టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడ ఇప్పుడు ప‌వ‌న్ వెంటే ఉంది. ఎప్పుడు త‌న ప‌ని తాను చూసుకునే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఒక్కసారిగా కోపాన్ని ప్రద‌ర్శించాడు. ఇదంతా రీసెంట్‌గా జరిగిన అత్తారింటికిదారేది థ్యాంక్యు మీట్‌లో చోటు చేసుంది. ప‌వ‌న్ లీక్డ్ మూవీను ఎవ‌రు కుట్ర పూరితంగా చేశారో ప‌వన్‌కు బాగా తెలుసు. ఆ వ్యక్తుల పేర్లను ప‌వ‌న్ త‌న స‌న్నిహితులు ద‌గ్గర వివ‌రించాడంట‌. ఆ పేర్లు ఇప్పుడు టాలీవుడ్ అంత‌టా వ్యాపించాయి. అయితే ప‌వ‌న్ అనుమ‌తిస్తే వాళ్ళను ఇండ‌స్ట్రీకు దూరంగా త‌రిమి కొడ‌తాం అని దానికి త‌గ్గ ప్రయ‌త్నాల‌ను కూడ కొంద‌రు వేగ‌వంతం చేశారు. అంతా సిద్ధం అయిన త‌రువాత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు దానికి సంబంధించిన వివరాల‌ను చెప్పారంట‌. అయితే వెనుక నుండి ఫైట్ చేయడం మ‌న ల‌క్షణం కాదు, ఈ వ్వవ‌హారాన్ని నేనుగా చూసుకుంటాన‌ని వాళ్ళకు న‌చ్చజెప్పటంతో వారు వెన‌క్కి త‌గ్గన‌ట్టు టాలీవుడ్ స‌మాచారం. ఆ లీక్డ్ వీడియోకు సంబంధించిన వాళ్ళను ప‌వ‌న్ డైరెక్ట్‌గానే ఎదుర్కొబోతున్నాడ‌ని టాలీవుడ్ కూడ ఆ వ్వవ‌హారాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌నేది టాలీవుడ్ పెద్దల‌కు వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: