పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది' చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్లలో కూడా తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డుల వైపు పరుగులు తీస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ కలెక్షన్స్ లో నెంబర్ వన్ గా కొనసాగిన ‘మగధీర’ సినిమా రికార్డులను బద్దలుకొట్టి 100 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు తీస్తోంది.  సినిమా ఇంత బంపర్ హిట్ అయిందన్న ఆనందంతో చిత్ర నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన పోస్టర్లు వివాదాస్పదంగా మారాయి అన్న విషయం తెలిసిందే. ‘వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలోనే పెద్ద హిట్ట అంటూ' పోస్టర్లపై ప్రకటించడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతూ, బాలీవుడ్లో ఇంతకంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి అన్న విమర్శలు రావడంతో ఈ విమర్శల పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించినట్లుగా తెలుస్తోంది.  పవన్ నిర్మాత ప్రసాద్ ను పిలిపించి ఇటువంటి తప్పుడు ప్రచార పోస్టర్లు విడుదల చేయవద్దని అని చెప్పడమే కాకుండా, ఇటువంటి ప్రచారం వల్ల సినిమా ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పి ఈ పోస్టర్లను సవరించి కొత్త పోస్టర్లను విడుదలచేయాలని గట్టిగా సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: