అప్పటి దాక ప్రణిత ఐరన్ లెగ్ అని అనేవారు, మరి ఇప్పుడు గోల్డెన్ లెగ్ ప్రణిత అని అంటున్నారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు ‘అత్తారింటికి దారేది’ అనే ఒకే ఒక్క సినిమా ప్రణీత జీవితాన్నే మార్చేసింది. నిజానికి ఈ సినిమాలో ప్రణీత చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టర్. కానీ ప్రధాన కథానాయిక సమంత కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది ప్రణీత. ఒక్క విజయంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ప్రణీత నామ జపం చేస్తోంది. ఈ మాటలకు తగ్గట్టు గానే మరో ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రణీతకు అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకునిగా ‘కంది రీగ’ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘రభస’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ప్రణీతను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో కూడా ప్రధాన కథానాయిక సమంత అన్న విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ తర్వాత మళ్ళీ సమంత, ప్రణీతల జోడీ కలిసి నటిస్తున్న సినిమా పవన్ కళ్యాణ్ కు ‘అత్తారిల్లు’ బ్లాక్ బస్టర్ ఇచ్చినట్లే జూనియర్ కు కూడ ఈ ‘రభస’ బ్లాక్ బస్టర్ గా మారి కలెక్షన్స్ రభస చేస్తుందేమో చూడాలి. జూనియర్ కెరియర్ కు ఎంతో ముఖ్యంగా మారిన ఈ ‘రభస’ విజయం జూనియర్ తో పాటు ప్రణితకు కూడా చాల అవసరం... 

మరింత సమాచారం తెలుసుకోండి: