పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘కోబలి’ సినిమా గురించి త్రివిక్రమ్ మరింత ఆశక్తికరమైన సమాచారం ఇచ్చారు. ఈ సినిమాలో వాడే భాష గురించి చాల జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకే స్క్రిప్టు లేటు అవుతుందని అంటున్నాడు త్రివిక్రమ్. అదే విధంగా 'కోబలి' కథ ఇంకా ప్రాధమిక దశలోనే ఉంది అంటున్నాడు త్రివిక్రమ్. శాతవాహనుల తర్వాత కాలం నాటి భాషను, కప్పట్రాల ప్రాంతాల్లో ఆరోజులలో వాడిన అచ్చమైన తెలుగు పదాలను ఈ సినిమాలో సంభాషణలుగా వాడుతున్నామని త్రివిక్రమ్ చెపుతున్నాడు.  ఇప్పటికీ ఆ ఏరియాలో అందమైన తెలుగు వినిపిస్తుందని అంటూ, మెహబూబ్‌నగర్‌లోని పలు గ్రామాల్లో కూడా తెలుగు భాష ఇంకా అందంగానే వినిపిస్తూ ఉంటుందని త్రివిక్రమ్ అంటున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ రీసెర్చ్ కే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేము అని అంటున్నాడు ఈ మాటల మాంత్రికుడు. జరుగుతోంది. అంతేకాదు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా కాదు కాబట్టి తనకూ, పవన్‌ కు అంత పారితోషికాలు ఇచ్చే వారు ఉండరు కాబట్టి తానే నిర్మాతగా ఈ సినిమాను పవన్ తో కలిసి నిర్మిస్తానని, అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందో మాత్రం చెప్పలేనని అంటూ ఎదో ఒకరోజు ఈ సినిమా నిర్మించే సాహసం తామిద్దరమే కలిసి చేస్తామని త్రివిక్రమ్ అంటున్నాడు.  రాయలసీమలో అమ్మవారికి బలి ఇచ్చే సాంప్రదాయాన్ని ‘కోబలి’ అని ఇప్పటికీ అంటారని మనందరికీ తెలియని రాయలసీమ సాంప్రదాయాలను ప్రతిబింబించే లా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు త్రివిక్రమ్. కమర్షియల్ కుటుంబ కధా సినిమాలకు చిరునామాగా ఉండే త్రివిక్రమ్ పవన్ తో చేస్తున్న ఈ ‘కోబలి’ ప్రయోగం ఎటువంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: