ఒకరు ఒకటి చేస్తుంటే కొందరు చూసి ఆనందపడతారు. కొందరేమో మనమూ అలా చేస్తే బాగుండేది అనుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం మనమెందుకు చేయకూడదు అంటూ తాము కూడా చేయడం మొదలుపెడతారు. ఇప్పుడు గుణశేఖర్ ఈ చివరి తరహాలో ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు ఫిల్మ్ నగర్ వారు. గుణశేఖర్ కి సెట్లు వేసే పిచ్చి ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా కోట్లు ఖర్చుపెట్టి తన సినిమాలో సెట్లు వేయించేవాడు. కానీ సినిమాలు మాత్రం మామూలువే తీశాడు. అయితే ఉన్నట్టుండి ఏమయ్యిందో ఏమో గానీ, ఒక్కసారిగా చరిత్ర మీద పడ్డాడు. రుద్రమదేవి సినిమాకి ముహూర్తం పెట్టాడు. సడెన్ గా ఇదేంటి అంటే, సడెన్ గా ఏమీ కాదు... ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఎప్పట్నుంచో అనుకుంటుంటే ఇప్పటికి తెమిలింది అన్నాడు. అతడు తన సినిమా తాను తీసుకుంటూ పోతున్నాడు కానీ... కొందరు అనేదేమంటే, అతడు రాజమౌళి దారిలో సాగేందుకు ట్రై చేస్తున్నాడని. అతడు బాహుబలి తీస్తున్నట్టుగానే, తాను రుద్రమదేవిని ప్రతిష్టాత్మకంగా తీయాలని తహతహలాడుతున్నాడట. రాజమౌళికి ఏమాత్రం తగ్గకుండా తీయాలని ఉవ్విళ్లూరుతున్నాడట. దీనికోసం మౌళి వేసే అడుగుల్ని ప్రతిక్షణం పరిశీలిస్తున్నాడని, అతడు ఏదైనా చేస్తే వెంటనే తానేం చేయాలా అని ప్లాన్లు వేసేస్తున్నాడని అంటున్నారు. తాజాగా గుణశేఖర్ తీసుకున్న నిర్ణయం చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. మొన్న ప్రభాస్ పుట్టినరోజుకు బాహుబలి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశాడు రాజమౌళి. అది ప్రభాస్ కు బర్త్ డే గిఫ్ట్ అన్నాడు. ఇప్పుడు గుణశేఖర్ కూడా అదే పని చేయనున్నాడు. నవంబర్ ఏడున రుద్రమదేవి టీజర్ ను రిలీజ్ చేయబోతున్నాడు. ఆ రోజే ఎందుకు అంటే... ఆ రోజు అనుష్క పుట్టినరోజు, ఆమెకు అది నేనిచ్చే కానుక అంటున్నాడు. అదీ సంగతి. అయితే అందరూ అంటున్నట్టు... దీన్ని ఫాలో అవడం అనరేమో. కాపీ కొట్టడం అనాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: