ఆడపిల్లలు కోమలంగా కనిపిస్తారు కానీ కఠినమైన చాలెంజులను కూడా చక్కగా ఎదుర్కుంటారని చరిత్రలో ఎన్నోసార్లు రుజువయ్యింది. నేను కూడా తక్కువేం కాదు అంటోంది అమలాపాల్. ఈమె చాలా ధైర్యవంతురాలట. అలా అని చెబితే మనం నమ్మమని అనుకుందో ఏమో... ఈ మధ్య ఓ సాహస కార్యం చేసింది అమ్మాయిగారు.   ప్రస్తుతం ఓ తమిళ చిత్ర షూటింగ్ కోసం జైపూర్ లో ఉంది అమలాపాల్. అక్కడే తన పుట్టినరోజును నిన్న ఘనంగా జరుపుకుంది. యూనిట్ అందరికీ పార్టీ ఇచ్చింది. సరదాగా ఎంజాయ్ చేసింది. అయితే ఇదంతా ఒకెత్తు. అలతకంటే ముందు అమల చేసిన సాహసం ఒకెత్తు. రాజస్థాన్ లో ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది. అక్కడ దెయ్యాలు ఉంటాయని, ఒక్కసారి వెళ్లామో ఇక తిరిగి వచ్చేది ఉండదని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్లేస్ కి వెళ్లి, ఒంటరిగా గడిపి వచ్చింది అమల. ఎందుకింత రిస్క్ అంటే... నాకు చిన్నప్పట్నుంచీ ఇలాంటి సాహసాలంటే ఇష్టం, ముఖ్యంగా హాంటెడ్ ప్లేసుల్లో ఉండి ఏం జరుగుతుందో చూడాలనిపిస్తూ ఉంటుంది, అందుకే వెళ్లొచ్చా అంటోంది. ఎవరికైనా చెబితే వద్దంటారని చెప్పకుండా ఆ పని చేసిందట మేడమ్. వెళ్లొచ్చాక అక్కడ తన అనుభవం గురించి చెబుతుంటే అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారట.  పిల్ల చూడ్డానికి చక్కగా ఉంటుంది... మరి ఇదేం పైత్యమో ఏమో. ఏమీ జరగలేదు కాబట్టి ఓకే. ఏదైనా జరిగివుంటే ఏంటి పరిస్థితి! నిజానికి ఆమె చేసిన పనివల్ల ఆ ప్లేస్ లో అలాంటివేమీ లేవని నిరూపణ అయితే అయ్యింది. కానీ ఒకవేళ నిజంగా ఏదైనా ఉండివుంటే ఏం జరిగేదో ఏమో. అమల అన్నీ లైట్ తీసుకుంటుంది కానీ మనం అమలను లైట్ తీసుకోకూడదండోయ్!

మరింత సమాచారం తెలుసుకోండి: