డస్కీ బ్యూటీ అమలాపాల్ కెరియర్ ప్రస్తుతం పెద్ద ఆశాజనకంగా లేకపోయిన తన పుట్టిన రోజును మాత్రం చాలా వెరైటీగా ఘనంగా జరుపుకుందని తెలుస్తోంది. తన పుట్టిన రోజు వేడుకకు చెన్నై ని వేదికగా తీసుకోకుండా ఏకంగా రాజస్థాన్ ను వేదికగా చేసుకుంది.  నిన్న ఈమె పుట్టినరోజును రాజస్థాన్ లో జరుపుకోవడానికి గల కారణం ప్రస్తుతం ఆమె నటిస్తున్న మలయాళ చిత్రం 'ఒరు ఇండియన్ ప్రణయ్ కథ' కోసం గత కొన్ని రోజులుగా రాజస్థాన్ లోని వివిధ లోకేషన్లలో ఈ ముద్దుగుమ్మ షూటింగు చేస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రం యూనిట్ కి నిన్న రాత్రి మాంచి మందు పార్టీ ఏర్పాటు చేసి హడావిడి చేసిందట. నిన్నటితో ఈ చిన్నది 23 వ ఏట ప్రవేశించింన అమలాపాల్ కు మంచి నటిగా పేరున్నా ప్రస్తుతం చేతిలో చెప్పుకోతగ్గ సినిమాలు లేవు.  ఈ సంవత్సరం ఈమె చరణ్, బన్నీలతో నటించి మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయినా టాలీవుడ్ ప్రేక్షకులలో ఈమెకు ఇంకా సరైన ఇమేజ్ఏర్పడలేదు. అదేవిధంగా ఈ మధ్య ఈమె తమిళ హీరో విజయ్ తో నటించిన సినిమా కూడా పరాజయం చెందడంతో ప్రస్తుతం ఈమె తన స్వస్థలం మలయాళ సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కుంటోoది. యంగ్ హీరోలను ఫాన్ చేసి మరీ అవకాశాలు ఇవ్వమంటు మార్కెట్ చేసుకునే ఈ మలయాళ కుట్టికి ఈ పుట్టినరోజు పార్టీ ఎంత వరకు కలిసివస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: