ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిమానుల‌కి దీపావ‌ళి కానుక‌ను ఇస్తున్నాడు. రీసెంట్‌గా త‌ను న‌టించిన మూవీ అత్తారింటికిదారేదిను ఘ‌న‌విజయం అందించిన అభిమానుల‌కు ప‌వ‌న్ స‌రికొత్తకానుక‌ను రెడీ చేశాడు. దీపావ‌ళి పండుగ మూడు రోజుల ముందుగానే ప‌వ‌న్ ఆ కానుక‌ను ఇస్తున్నాడు. అత్తారింటికిదారేది మూవీలో కొత్త సీన్లను క‌లుపుతున్నార‌నేది ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్‌. అయితే ఇప్పుడు దానిపై క్లారిటి వ‌చ్చింది. ఆరు కొత్త సీన్లతో ఆరు నిముషాల నిడివి ఉన్న ఆ సీన్స్‌, అత్తారింటికిదారేది మూవీకు జ‌త చేస్తున్నారు. ఆక్టోబ‌ర్ 31 నుండి ఈ సీన్స్ ప‌వ‌న్ మూవీకు క‌లుపుతున్నారు. దీంతో అత్తారింటికిదారేది మూవీ మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా మారుతుంది. ఇంకో విష‌యం ఏంటంటే ఈ కొత్త సీన్లు జ‌త‌కావ‌డంతో అత్తారింటికిదారేది మూవీ దివాళి పండ‌గ క‌లెక్షన్స్ మ‌రింత ఊపందుకుంటున్నాయ‌ని బాక్సాపీస్ అంచ‌నా. ప‌వ‌న్ మూవీకు కొత్త సీన్స్ క‌లిసాయ‌ని తెలుసున్న అభిమానులు మ‌రింత ఉత్సాహంగా ఉన్నారు. అక్టోబ‌ర్‌ 31 మ‌ళ్ళీ ఆ మూవీను చూడ‌టానికి తెగ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. వంద కోట్ల క‌లెక్షన్స్‌కు అతి చేరువ‌లో ఉన్న ఈ మూవీకు, ఈ కొత్త సీన్స్‌తో ఆ టార్గెట్ ఇంకొంచెం తొంద‌ర‌గా పూర్తి అవుతుంద‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: