1983వ సంవత్సరం చిరంజీవి జీవితంలో మరిచిపోలేని సంవత్సం తెలుగు సినిమారంగం ఇప్పటికీ గుర్తుంచుకోదగ్గ సంవత్సరం. ఆ సంవత్సరంలో తెలుగు సినిమాకు చెందిన రెండు అద్భుతాలు జరిగాయి. అందులో ఒకటి మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మహానటుడు ఎన్టీఆర్ అదే సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ లేని స్థానాన్ని ఎవరు భార్తీచేస్తారు అన్న ప్రశ్నకు ‘ఖైదీ’ రూపంలో చిరంజీవి భర్తీచేసారు. ‘ఖైదీ’ అనగానే ఇప్పటికీ గుర్తొచ్చేది ‘పోలీస్ స్టేషన్ ఫైట్’. ఒక అగంతకుడు పోలీస్టేషన్‌లో పోలీసులందరినీ చావబాదడం లాంటి సీన్ అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులు చూడలేదు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు చిరంజీవి ‘ఖైదీ’ లో ఉన్నాయి.  చిరంజీవిని రాత్రికి రాత్రి సూపర్ స్టార్‌ని చేసిన ‘ఖైదీ’ విడుదలై నేటికి 30 ఏళ్లు. ఈ సినిమాలో కొన్ని నమ్మలేని నిజాలున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ లోని 56 సన్నీ వేశాలను రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఆరు గంటలలో రాస్తే ఆ సన్నివేశాలకు మూడు రోజులలో పరుచూరి గోపాలకృష్ణ సంభాషణలు రాసారు. అసలు ఈ సినిమాలో అప్పటికి సూపర్ స్టార్ గా టాలీవుడ్ ను ఏలుతున్న కృష్ణ హీరోగా నటించవలసి ఉన్నా కాల్ షీట్స్ కుదరకపోవడంతో కృష్ణ స్థానంలోకి చిరంజీవి వచ్చాడు. ఈ సినిమా మొదటి క్లాప్ ను కూడా ఇచ్చింది సూపర్ స్టార్ కృష్ణ అనేది యాదృచ్చికం అనుకోవాలి. ఈ సినిమాను కేవలం 15లక్షల పెట్టుబడితో నిర్మాతలు పూర్తి చేస్తే ఈ సినిమా విడుదలై అఖండ విజయం సాధించి మొదటి వారంలోనే 34లక్షలు వసూలు చేసి ఆరోజులలో టాలీవుడ్ రికార్డును క్రియేట్ చేసింది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే తెలుగుసినిమాల లో నిప్పులుగక్కే స్టీన్ గన్స్, అగ్నికీలలు వెదజల్లే బాంబ్ బ్లాస్టింగులు ఈ సినిమా నుంచే మొదలయ్యాయి. ప్రేమ, పగ, సెంటిమెంట్ కలబోసినా కమర్షియల్ సినిమాగా ‘ఖైదీ’ ఓసంచలనం, ఓప్రభంజనం అంతేకాదు చిరంజీవి దశ ను మార్చిన సినిమాగా ‘ఖైదీ’ రికార్డు క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాను రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయాలనీ కొంతమంది భావించినా చరణ్ ఆ సాహసం చేయడానికి ఇష్టపడటం లేదని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి కెరియర్ లో “ఖైదీ” ఒక మైలురాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: