ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల రేంజ్ లో అనుష్క క్రేజ్ పెరిగిపోతోంది. 200 కోట్ల హీరోయిన్ గా అనుష్క పాపులారిటి వెలిగిపోతోంది. తెలుగులో హీరోయిన్ అనుష్కకు ఉన్న ఫాలోయింగ్, స్టార్ స్టేటస్ ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ కత్తి పట్టే వీరనారి పాత్రలకు అనుష్క మినహా మరెవ్వరూ ప్రత్యామ్నాయం లేరు అనే రేంజ్ కి ఎదిగిపోయింది అనుష్క. అనుష్క నటించిన మరో భారీ చిత్రం ‘వర్ణ' ఆడియో రిలీజ్ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఈసినిమా పై భారీ అంచనాలు పెంచుతున్నారు. ఈ ఆడియో వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ కటౌట్ అందరినీ ఆకర్షించింది. ఇప్పటి వరకు అక్కడ స్టార్ హీరోలకు కూడా అంతపెద్ద కటౌట్లు పెట్టిన దాఖలాలు లేవు. అనుష్క కటౌట్ ఇంత భారీగా ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగానే నిర్మాతలు ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం అవుతోంది. వర్ణ చిత్రంలో ఆర్య, అనుష్క జంటగా నటించారు. ఈ చిత్రాన్ని పి.వి.పి. సినిమా పతాకంపై పరమ్‌ వి.పొట్లూరి నిర్మించారు. ఈ ఆడియో వేడుకలో ఈ సినిమా కోసం అనుష్క వాడిన కత్తిని అందరికీ చూపెడుతూ యాంకర్ సుమ హడావిడి చేసింది. పెద్ద హీరోలతో సమానంగా అనుష్కను ఆకాశానికి ఎత్తేస్తూ చాలామంది అతిధులు మాట్లాడారు. ఈ సినిమాలో జార్జియా దేశంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్కడ 18వ శతాబ్దంనాటి భవంతిలో చిత్రించిన దృశ్యాలు ఈ సినిమాకు కీలకమైనవి అని అంటున్నారు. ఈ సినిమాలో యోగా బ్యూటీ అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, మరొక పాత్రలో ట్రైబల్ ఉమన్ గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్క పై తీసిన కీలక ఈ సన్నివేశాలుఈసినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు ఈమార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే నిన్నటి ఆడియో వేడుకకు చాలా హుందాగా ముస్తాబై అనుష్క రావడం అందరి దృష్టిని ఆకర్షించింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: