నాయక్ సినిమా తర్వాత ఇంతవరకూ వినాయక్ సినిమా వచ్చిందే లేదు. ఓ డైరెక్టర్, అది కూడా టాప్ డైరెక్టర్ ఇంత గ్యాప్ తీసుకోవడమనేది అంత కరెక్ట్ కాదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ పాపం వినాయక్ కష్టాలు ఎవరికి తెలుసు! బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ ని హీరోగా లాంచ్ చేసే బాధ్యతలను తీసుకున్నా వినాయక్. దాని కోసం బెల్లంకొండ పెద్ద మొత్తంలో సొమ్ము ముట్టజెప్పాడు కూడా. నిజానికి అదే వినాయక్ కొంప ముంచింది. కమిటైన ప్రాజెక్టును కాదనుకోలేడు. పోనీ మొదలెడదామా అంటే కథ కుదిరి చావదు. తను నచ్చినా బెల్లంకొండకు నచ్చదు. అతడికి నచ్చేది తనకు సూటవదు. ఏం చేయాలో తోచన కొన్ని నెలలుగా నానా తంటాలు పడుతున్నాడు పాపం. అయితే ఎట్టకేలకు వినాయక్ కి కథ దొరికిందని సమాచారం. రచయితలందరినీ రుబ్బీ రుబ్బీ... చివరకు ఓ మాంచి కథ పట్టేశాడట. కానీ విచిత్రం ఏమిటంటే, అది అతని తరహా సినిమా కాదు. డ్యాన్స్ ఓరియెంటెడ్ మూవీ అట. శ్రీనివాస్ మంచి డ్యాన్సర్ కావడంతో అలాంటి కథను తీసుకున్నాడట. ఓకే. తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ సుమోలు పేల్చేవాడికి స్టెప్పుల గురించి ఏం తెలుస్తుంది? ఎమోషన్స్ చూపించేవాడిని డ్యాన్స్ మూమెంట్స్ ఎలా అర్థమవుతాయి? ఎవరు ఏం చేయగలరో అదే చేయాలి. వినాయక్ వెళ్లి ప్రభుదేవా, లారెన్స్ ల మాదిరి సినిమాలు తీస్తానంటే ఎలా? లేటయితే అయ్యింది. అనవసరంగా రిస్క్ తీసుకోకు వినాయక్!  

మరింత సమాచారం తెలుసుకోండి: