ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన న‌టుడికి అస‌లైన ప్రొఫిష‌న‌లిజం ఎక్కడ క‌న‌ప‌డుతుంది అంటే క‌రీనాక‌పూర్ అందుకు ఉద‌హ‌ర‌ణ‌గా మారింది. క‌రీనాక‌పూర్, సెఫ్ అలీ ఖాన్‌ను పెళ్ళి చేసుకున్న త‌రువాత లైఫ్‌ను మరింత ఎంజాయ్ చేస్తుంది. ముఖ్యంగా పెళ్ళికి ముందు కంటే పెళ్ళి త‌రువాతే క‌రీనా త‌న లైఫ్‌ను ఎక్కువుగా ఎంజాయ్ చేస్తున్నట్టు అంద‌రితో చెప్పుకుంటుంది. పెళ్లి త‌రువాత ఆన్ స్క్రీన్ ముద్దుల‌కు నో చెప్పిన క‌రీనా అంతలోనే మాట మార్చింది. 'మూవీలో న‌టించ‌డం అనేది ప్రొఫిష‌న‌ల్‌గానే ఉంటుంది. ఏదైన పాత్ర చేసేట‌ప్పుడు హ‌ద్దులు మీరి చేయడం అనేది ఆ పాత్ర ప్రాముఖ్యత‌ను బ‌ట్టి ఉంటుంది. అందుకే నేను ముద్దు సీన్లకు ఎన్నడూ నో చెప్పలేదు. పెళ్ళి త‌రువాత కూడ నేను ముద్దు సీన్లకు రెడీగానే ఉన్నాను. అ సీన్‌కు అంత ఇంపార్టెన్స్ ఉంటే నేను మాత్రం ఎలా కాద‌న‌గ‌ల‌ను' అంటూ లేటెస్ట్‌గా కరీనా స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో క‌రీనాక‌పూర్ పెళ్ళి త‌రువాత కూడ మొగుడు ముందే వేరొక హీరోతో రొమాన్స్ చేస్తుంటే, దాన్ని చూస్తూ మొగుడిగా సైఫ్ ఎలా ఉండ‌గ‌లుగుతాడు అని బాలీవుడ్ జోకులు వేసుకుంటుంది. మొత్తానికి క‌రీనాక‌పూర్ పెళ్ళైన మొద‌టి సంవ‌త్సార‌నికే ఈ విధంగా మాట‌లు మారుస్తుంటే అంద‌రూ ఆశ్యర్యప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: