దీపికాప‌దుకొనె అంటే ఎఫైర్లకు పెట్టింది పేరులా మారిపోయింది. దీపికాప‌దుకొనె,ర‌ణ్‌భీర్‌క‌పూర్‌ల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంద‌ని, ఎట్ ప్రెజెంట్ వీరిద్దరికి ఎటువంటి మాట‌లు లేవ‌ని బాహ్య ప్రపంచానికి తెలిసిన నిజం కాని, బాలీవుడ్ మాత్రం ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలిపింది. ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,క‌త్రినాకైప్‌ల మ‌ధ్య ప్రేమాయణం తారాస్థాయికి చేర‌డంతో ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, దీపికాను దూరంగా పెట్టాడ‌న్నది గాసిప్ మాత్రమే. కాని దీపికా,ర‌ణ్‌భీర్‌క‌పూర్‌ల మ‌ధ్య ఇప్పటికీ ఎఫైర్ కొన‌సాగుతూనే ఉంద‌ని బాలీవుడ్‌ మీడియా మ‌రోసారి బ‌య‌ట పెట్టింది. పైకి మాత్రం ఇద్దరూ గొడ‌వ‌ప‌డుతూ క‌న‌ప‌డుతున్నట్టు క‌నిపిస్తున్నా, లోప‌ల మాత్రం సీక్రెట్ మీటింగ్‌లు,డేటింగ్‌లు కొన‌సాగుతున్నాయ‌ని బిటౌన్ వివ‌రించింది. ఇదిలా ఉంటే ర‌ణ్‌భీర్‌క‌పూర్ త‌రువాత దీపికాకి ద‌గ్గరైన మ‌రో హీరో ర‌ణ్‌వీర్‌సింగ్‌. ర‌ణ్‌వీర్‌సింగ్‌తోనూ దీపికా హాట్ హాట్ ఎఫైర్‌ను న‌డుపుతుంది. దీపికా ప‌దుకొనె అప్‌క‌మింగ్ ఫిల్మ్ రామ్‌లీలాలో ర‌ణ్‌వీర్‌సింగ్ హీరో కావ‌డంతో వారంలో అయిదు రోజులు ర‌ణ్‌వీర్‌సింగ్‌తోనే దీపికా టైంను స్పెండ్ చేస్తుంది. రీసెంట్‌గా రామ్‌లీలా మూవీ ప్రమోష‌న్‌లో పాల్గొనాల్సిన దీపికా, ఆ ప్రమోష‌న్‌కు డుమ్మా కొట్టి, ర‌ణ్‌భీర్‌క‌పూర్‌తో వీకెండ్‌ను ఎంజాయ్ చేసింద‌ని బాలీవుడ్ చెబుతుంది. ఈ విధంగా ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,ర‌ణ్‌వీర్‌సింగ్ ఇద్దరితోనూ ఒక‌రికి అంటే మ‌రొక‌రికి తెలియ‌కుండా దీపికాప‌దుకొనె ఎఫైర్స్‌ను సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: